
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండియాకు తిరిగొచ్చారు. USAలో వారం రోజుల టూర్ ముగించుకుని ఈ సాయంత్రం 8.30 నిమిషాలకు పీఎం మోడీ ఢిల్లీలో ప్రత్యేక విమానంలో ల్యాండ్ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి స్వాగతం పలికేందుకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు.. వేలాదిగా పాలం ఎయిర్ పోర్టుకు తరలివెళ్లారు.
ప్రధానమంత్రి మోడీ పర్యటనకు అమెరికా ప్రభుత్వం కూడా అత్యంత ప్రాధాన్యత కల్పించింది. హూస్టన్ లో మోడీ హౌడీ లాంటి భారీ ప్రోగ్రామ్ ను నిర్వహించింది. ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశించి మోడీ, ట్రంప్ మాట్లాడారు. ఆ తర్వాత… యూఎన్ జనరల్ అసెంబ్లీలోనూ ఇండియా విజన్ ను మోడీ వివరించారు. భారత్ మద్దతు అగ్రరాజ్యానికి ఎంత అవసరమో.. మోడీ పర్యటనతో ప్రపంచానికి తెలిసిన వేళ ఇది అని.. ప్రధానికి భారీ స్థాయిలో స్వాగతం పలకాలని బీజేపీ గ్రాండ్ వెల్కమ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. అందుకు తగ్గట్టుగా.. ఢిల్లీలో ల్యాండ్ అయిన మోడీకి.. దాదాపు 30వేలమందితో స్వాగతం ఏర్పాటుచేయించింది. ఆ తర్వాత స్వాగత సభలో నరేంద్రమోడీ మాట్లాడారు.