లోక్ సభలో మోడీకి అదిరే స్వాగతం

లోక్ సభలో మోడీకి అదిరే స్వాగతం

జమ్ముకశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఇవాళ పార్లమెంట్ లో ఆమోదం పొందింది. సభలో చర్చ జరుగుతున్న టైమ్ లో … కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడున్న సందర్భంలో.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ లోక్ సభలోకి వచ్చారు. రవిశంకర్ ప్రసాద్ స్పీచ్ తో అప్పటికే జోష్ మీదున్నారు బీజేపీ సభ్యులు. అదే సమయంలో… ప్రధాని రావడంతో… బీజేపీ ఎంపీలంతా లేచి నిలబడి స్వాగతం పలికారు. ముందు వరుసలో కూర్చున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. మోడీకి స్వాగతం పలుకుతూ.. బల్లలు చరిచారు. అందరూ బిగ్గరగా వెల్కం అంటూ మోడీకి స్వాగతం పలికారు. అందరికీ నమస్కరిస్తూ.. నవ్వుతూ మోడీ తన సీట్లో .. రాజ్ నాథ్ సింగ్ పక్కన కూర్చున్నారు. అందరూ తనకు మద్దతుగా నినాదాలు చేయడంతో మోడీ నవ్వుతూ స్పందించారు. ఆ సయమంలో… లోక్ సభలో బీజేపీ ఎంపీలు చేసిన ‘వందే మాతరం’, ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో లోక్ సభ దద్దరిల్లిపోయింది. కొన్ని నిమిషాల పాటు రవిశంకర్ ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా ఆగిపోయారు. ఆ తర్వాత కొనసాగించారు.