ఎలక్షన్ ఎఫెక్ట్ : 5 లక్షల టన్నుల ఉల్లి కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం

ఎలక్షన్ ఎఫెక్ట్ : 5 లక్షల టన్నుల ఉల్లి కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం

ఇప్పటి వరకు ఉల్లి ఎగుమతిని నిషేధించిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో  ఉల్లి రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది.   ఏప్రిల్​ 1 నుంచి 5 లక్షల టన్నుల ఉల్లిని కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయంతీసుకుందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్‌ సింగ్‌, ప్రత్యేక కార్యదర్శి నిధి ఖరే ప్రకటించారు. ఇప్పుడు కొనుగోలు చేసే ఉల్లిని బఫర్​ స్టాక్​గా ఉంటుందని తెలిపారు.

మహారాష్ట్రలోని లాసల్ గావ్​ లో ఏడాది క్రితం రూ. 8 లకు రైతుల నుంచి కొనుగోలు చేశారని ... కాని ఇప్పుడు రైతులకు పెరిగిన ఖర్చుల దృష్ట్యా వారికి మద్దతు ధర  రూ. 14 లు లభిస్తుందని  నియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ సింగ్ తెలిపారు. 2023 ఏప్రిల్​ నుంచి 2024 మార్చి వరకు ఉండే సీజన్​ లో ఉల్లిని బఫర్​ స్టాకు కోసం 7 లక్షల ఉల్లిని కేంద్రం  కొనుగోలు చేసింది.ప్రభుత్వం ఎప్పుడూ తక్కువ ధరకు ఉల్లిని కొనుగోలు చేయలేదని రోహిత్ సింగ్ అన్నారు. గత రబీ సీజన్‌లో కిలో ఉల్లిని సగటున రూ.17 చొప్పున కొనుగోలు చేశారు.

ఈ ఏడాది ఉల్లి బఫర్​ స్టాకు కోసం  కొనుగోలు చేసే వ్యవధిని పొడిగించినట్లు రోహిత్​ సింగ్​ తెలిపారు.  గతేడాది  కొన్న 7 లక్షల టన్నుల ఉల్లిలో ప్రస్తుతం 25 వేల టన్నులు మాత్రమే బఫర్​ స్టాకు ఉందన్నారు.  గతంలో మాదిరిగా రిటైల్​ ధర రూ. 25 విక్రయిస్తుందా అనే విషయానికి స్పష్టత ఇవ్వలేదు.  హోల్​ సేల్​ మార్కెట్లలో ఉన్న ధరలకే విక్రమయిస్తామని ఇంకా ఉల్లి విక్రయ ధరను నిర్ణయించలేదని అధికారులు తెలిపారు... ఏది ఏమైనా.. ఎన్నికల సమయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఉల్లి రైతులకు కొంత ఊరట లభించింది.  ఒక్క ఉల్లి రైతులను కాదు.. అన్ని రకాల పంటలను కొనుగోలు చేసి అన్నదాతను ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తించాలి.