
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌లో పేదలకు సాయం చేయడానికి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నరేగా స్కీమ్‌ను కేంద్ర సర్కార్ ఉపయోగించడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కామెంట్స్ చేశారు. ఆరు సంవత్సరాల ప్రతికూల ప్రభుత్వ పాలనలో కూడా నరేగా తన విలువను కాపాడుకుందని సోనియా చెప్పారు. ఆ స్కీమ్‌ను తిరస్కరించడానికి, అణగదొక్కడానికి ట్రై చేసిన కేంద్రం.. మొత్తానికి అయిష్టంగానే దానిపై ఆధారపడాల్సి వచ్చిందన్నారు. అలాగే ఈ విషయాన్ని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇష్యూలా మార్చొద్దని పేర్కొన్నారు.
‘పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేగా స్కీమ్‌ను నిలిపేయడం ఆచరణాత్మకం కాదని ప్రధాని మోడీ గ్రహించారు. దానికి బదులుగా నరేగాను అపహాస్యం చేయడానికి ప్రయత్నించారు. అలాగే ఓ ప్రసంగంలో.. ‘మీ వైఫల్యానికిది సజీవ స్మారక చిహ్నం’ అంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శించారు. అనేక కష్టాలతోపాటు ఎకానమీ మందగమనం మధ్య యూపీఏ ప్రవేశపెట్టిన గ్రామీణ సహాయ కార్యక్రమం (నరేగా)పై కేంద్ర సర్కార్ ఆధారపడాల్సి వచ్చింది. ఇది జాతి సంక్షోభం. రాజకీయాలకు సరైన టైమ్ కాదు. దీన్ని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ సమస్యగా చూడొద్దు. సర్కార్‌కు నా విజ్ఞప్తి ఏంటంటే.. మీ చేతిలో పవర్‌ఫుల్ యంత్రాంగం ఉంది. దానిని దేశ ప్రజలకు అవసరమైన సమయంలో తగిన సాయం చేయడానికి యూజ్ చేయండి’ అని సోనియా చెప్పారు.