న్యూఢిల్లీ : నీట్ యూజీ ఎగ్జాంలో అవకతవకల ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని కాంగ్రెస్ చీఫ్మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. 24 లక్షల మంది స్టూడెంట్ల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ విషయంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఫోరెన్సిక్ దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ స్కాంను ఎన్టీఏ, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ద్వారా కవర్ అప్ చేయాలని మోదీ సర్కారు చూస్తోందని ఖర్గే ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు.
‘‘నీట్ పేపర్ లీక్ కాకపోతే.. బిహార్ లో 13 మందిని ఎందుకు అరెస్ట్ చేశారు? పేపర్ లీకేజీ కోసం బిహార్ లోని ఎడ్యుకేషన్ మాఫియాకు రూ. 30 నుంచి రూ. 50 లక్షలు ముట్టాయని పాట్నా పోలీసులు ప్రకటించలేదా? గుజరాత్ లోని గోధ్రాలోనూ నీట్ యూజీ చీటింగ్ రాకెట్ బయటపడలేదా? ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయలేదా? రూ. 12 కోట్ల లావాదేవీలు జరిగినట్టు గుర్తించలేదా?” అని కాంగ్రెస్ చీఫ్ప్రశ్నించారు.
కాగా, మోదీ సర్కారు యువత కలలను ఛిద్రం చేస్తోందని, 24 లక్షల మంది స్టూడెంట్ల ఆక్రందనలను కూడా పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు.