
బీజేపీ100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు కేవలం ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ గాంధీనగర్ లో నాల్గొవ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్ పోని సోమవారం (సెప్టెంబర్ 16)న మోదీ ప్రారంభించారు. 2047నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్రమంత్రులు పాల్గొన్నారు. అయోధ్యతో పాటు మరో 16 నగరాలను మోడల్ సోలార్ సిటీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అయోధ్య రాముడి జన్మస్థలం. అతడు సూర్యవంశీ. అయోధ్యలో రాముడి యొక్క గొప్ప ఆలయం నిర్మించబడింది. అక్కడ మరి కొన్ని రోజుల్లో సోలార్ సిటీ పనులు పూర్తి అవుతాయని తెలిపారు.
‘‘నేటి భారతదేశం రాబోయే 1000 సంవత్సరాలకు పునాదిని సృష్టిస్తోంది. మా లక్ష్యం అగ్రస్థానానికి చేరుకోవడమే కాదు.. అగ్రస్థానంలో నిలదొక్కుకోవడం కూడా. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారతదేశానికి దాని శక్తి అవసరాలు తెలుసు. అందుకు మన దగ్గర స్వంత చమురు, గ్యాస్ నిల్వలు లేవని కూడా మనకు తెలుసు... కాబట్టి మేము మన భవిష్యత్తును సౌర, పవన, అణు మరియు జల శక్తులపై నిర్మించాలని నిర్ణయించుకున్నాము’’ అని ప్రధాని మోదీ అన్నారు.
#WATCH | Gandhinagar, Gujarat: At the inauguration of the 4th Global Renewable Energy Investor’s Meet and Expo (RE-INVEST), PM Modi says, "... When the issue of climate change did not even emerge in the world, Mahatma Gandhi alerted the world... His life was of minimum carbon… pic.twitter.com/jIOlu8aCfl
— ANI (@ANI) September 16, 2024