దేశాన్ని మోడీ సరైన దారిలో తీసుకెళ్తున్నారు : వివేక్​ వెంకటస్వామి

దేశాన్ని మోడీ సరైన దారిలో తీసుకెళ్తున్నారు :  వివేక్​ వెంకటస్వామి
  • సెంట్రల్ బడ్జెట్ రిలేటెడ్ యాక్టివీటీస్ 
  • టీమ్ మెంబర్ వివేక్​ వెంకటస్వామి 
  • ఢిల్లీలో సమావేశమైన కమిటీ 

ఢిల్లీ , వెలుగు: ప్రపంచంలో దేశాన్ని టాప్ 5 లో ఉంచేందుకు..యూకేను దాటి 3 ట్రిలియన్ ఎకానమీగా చేసేందుకు  ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని సెంట్రల్ బడ్జెట్ రిలేటెడ్ యాక్టివీటీస్ టీమ్ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. బడ్జెట్ పై కేంద్రం నియమించిన కమిటీ మంగళవారం ఢిల్లీలో చైర్మన్, ఎంపీ సుశీల్ కుమార్ మోడీ అధ్యక్షతన సమావేశమైంది. ఈ మీటింగ్ లో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, అశోక్ లహరి, రాజ్ కుమార్ చహార్, ఎంపీ తేజస్వి సూర్య, గోపాల్ కృష్ణ అగర్వాల్,  సంజు వర్మ, వరుణ్ జవేరి పాల్గొన్నారు. సమావేశం తర్వాత టీమ్ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు.

కేంద్ర బడ్జెట్, వివిధ స్కీమ్ లకు కేంద్రం కేటాయిస్తున్న నిధులపై  అన్ని రాష్ర్టాల రాజధానుల్లో ప్రెస్ మీట్లు, టౌన్ హాల్స్ లో మీటింగ్ లు నిర్వహించాలని ప్రధాని జాతీయ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారన్నారు. ప్రపంచంలో ఆర్ధిక మాంద్యం సమస్య ఉన్నా మన దేశాన్ని మన ప్రధాని సరైన దారిలో తీసుకెళ్తున్నారన్నారు. బడ్జెట్​లో హైలెట్స్ మోమోరాండం రెడీ చేసి అన్ని రాష్ర్టాల రాజధానుల్లో కేంద్ర మంత్రి లేదా సీనియర్ బీజేపీ లీడర్ ప్రెస్ మీట్లు పెట్టాలని, టౌన్ హాల్స్​లో మీటింగ్ లు నిర్వహించాలని కమిటీలో నిర్ణయించినట్లు వెల్లడించారు. రైల్వేకు కేంద్రం ఎన్ని నిధులు కేటాయించిందో అన్ని రాష్ర్టాల ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.