
జీ 20 సదస్సు విజయవంతంగా పూర్తికావడంతో ప్రధాని మోడీ ఇండియా చేరుకున్నారు. గురువారం ప్రారంభమైన మూడురోజుల సదస్సు శనివారంతో ముగిసింది. ఈ సదస్సులో భాగంగా మోడీ బ్రిక్దేశాధినేతలతో సమావేశమయ్యారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ట్రంప్తోనూ, జపాన్ప్రధాని షింజో అబెతోనూ చర్చలు జరిపారు. విదేశాంగ విధానాలు, ఇంటర్నేషనల్ట్రేడ్విషయంలో పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయానికొచ్చారు. ప్రకృతి విపత్తుల నివారణలో కలిసి పనిచేయాలంటూ జీ20 దేశాలకు మోడీ పిలుపునిచ్చారు. పేద దేశాలపై ఈ విపత్తుల ప్రభావం తీవ్రంగా ఉంటోందని చెబుతూ.. పెద్ద మనసుతో వాటిని ఆదుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రపంచ లీడర్లకు ట్విట్టర్ద్వారా మోడీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శనివారం సాయంత్రం మోడీ ఇండియా
బయలుదేరారు.
సదస్సులో యోగా ప్రచారం..
భారతీయ యోగా, కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్భారత్ లను ప్రధాని మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆయుష్మాన్భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్స్కీం అని వివరించారు. యోగా గొప్పతనాన్ని ఐరాస సాధారణ సభకూడా గుర్తించిందని, జూన్21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహిస్తోందని చెప్పారు. ఈ సదస్సులో మహిళా సాధికారతపైన ప్రత్యేక సమావేశాలు జరిగాయి. లింగ సమానత్వంపైన మరింత కృషి జరగాలని నేతలు అభిప్రాయపడ్డారు.
ఎంత సక్కగున్నరో!
మోడీకి ఆస్ట్రేలియా ప్రధాని కాంప్లిమెంట్ జీ20లో దిగిన సెల్ఫీ ట్వీట్
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రధాని నరేంద్ర మోడీకి కితాబిచ్చారు. జీ20 సదస్సులో మోడీతో దిగిన సెల్ఫీని ట్వీట్ చేసిన మోరిసన్ “ కిత్నా అబ్బా హై మోడీ”(ఎంత చక్కగున్నారు మోడీ) అని ట్వీట్ చేశారు. దానికి ప్రధాని కూడా రిప్లై ఇచ్చారు.
“ మన రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాను” అని అన్నారు. జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జీ20 దేశాల సదస్సులో ప్రధాని మోడీ పలువురు దేశాధినేతలతో భేటీ అయ్యారు.