
ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి సమావేశం కావడంతో కేబినెట్ నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల రోస్టర్ విధానం పునరుద్ధరించడం పై…. మంత్రి మండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండు వందల పాయింట్ల రిజర్వేషన్ రోస్టర్ విధానాన్ని పునరుద్ధరించాలని ఇప్పటికే పలు విద్యార్థి, అధ్యాపక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.