గంగా ఎక్స్ ప్రెస్ వేకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ

గంగా ఎక్స్ ప్రెస్ వేకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ

యూపీ : ఉత్తర్ ప్రదేశ్ త్వరలోనే మోడ్రన్ స్టేట్ కాబోతోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన రాష్ట్రంగా నిలుస్తుందనడానికి ఎక్స్ ప్రెస్ వేలు, ఎయిర్ పోర్టులు, రైలు మార్గాల నిర్మాణమే నిదర్శనమని చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్ పూర్ లో గంగా ఎక్స్ ప్రెస్ వేకు శంకుస్థాపన చేసిన మోడీ ఈ  వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా రోడ్లను అనుసంధానించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. 
గంగా ఎక్స్ ప్రెస్ వేను 594 కిలోమీటర్ల పొడువున సిక్స్ లేన్ గా నిర్మిస్తున్నారు. మీరఠ్ లోని బిజౌలీ గ్రామంలో ప్రారంభమై ప్రయాగ్ రాజ్ లోని జుదాపుర్ దండు గ్రామం వరకు ఉండే ఈ రహదారి నిర్మాణానికి రూ.36,200 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే యూపీలో అత్యంత పొడవైన ఎక్స్ ప్రెస్ వేగా దీనికి గుర్తింపు రానుంది. సిక్స్ లేన్ గా నిర్మిస్తున్న ఈ ఎక్స్ ప్రెస్ వేను ఎయిట్ లేన్ గా విస్తరించే అవకాశముంది. ఎక్స్ ప్రెస్ వే పక్కనే ఎయిర్ ఫోర్స్ ప్లేన్లు టేకాఫ్, ల్యాండ్ అయ్యేలా 3.5 కిలోమీటర్ల మేర ఎయిర్ స్ట్రిప్ ను కూడా నిర్మిస్తున్నారు. 

For more news

బోర్డర్‌‌లో మరోసారి డ్రోన్ కలకలం

బాలిక ఫిర్యాదు: మరుగుదొడ్లు శుభ్రం చేసిన మంత్రి