కన్యాకుమారిలో మోదీ ధ్యానం

కన్యాకుమారిలో మోదీ ధ్యానం

కన్యాకుమారి : తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ మెడిటేషన్ చేస్తున్న ఫొటోలు, వీడియోను బీజేపీ శుక్రవారం ట్విట్టర్ లో విడుదల చేసింది. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం కలిసే చోట ఉన్న ఈ ప్రాంతంలో స్వామి వివేకానంద 1892లో ధ్యానం చేశారు. నేషనల్ యూనిటీకి గుర్తుగా మోదీ కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తున్నారని బీజేపీ ట్వీట్ చేసింది. 

కన్యాకుమారికి గురువారం రాత్రి చేరుకున్న మోదీ ఇక్కడి వివేకానంద ధ్యాన మండపంలో శనివారం సాయంత్రం వరకూ ధ్యానం చేయనున్నారు. మోదీ సముద్రం వద్ద సూర్యుడికి అర్ఘ్యం వదలడంతోపాటు జపం కూడా చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ కూడా రిలీజ్ చేసింది. 48 గంటల పాటు ఆధ్యాత్మిక చింతన తర్వాత ప్రధాని శనివారం సాయంత్రం తిరిగి ఢిల్లీకి బయలుదేరనున్నారు. కాగా, 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ముందు కూడా మోదీ కేదార్ నాథ్ కు వెళ్లి గుహలో ధ్యానం చేస్తూ ఇలాగే ఆధ్యాత్మిక చింతనతో గడిపారు.