పండుగలను ప్రజలు జాగ్రత్తగా జరుపుకోవాలి

పండుగలను ప్రజలు జాగ్రత్తగా జరుపుకోవాలి

దేశంలో ఉగ్రరూపం దాల్చిన కరోనావైరస్ దృష్ట్యా రాబోయే పండుగ సీజన్లో జాగ్రత్త వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ లో ప్రజలను కోరారు. ఇప్పటికే ప్రజలు కరోనాకు భయపడి క్రమశిక్షణతో ఉంటున్నారని ఆయన అన్నారు.

‘ఇది పండుగల సమయం. కానీ కోవిడ్ కారణంగా ప్రజలు స్వేచ్ఛగా పండుగలు జరుపుకోవడం లేదు. కరోనాను నిర్మూలించాలంటే ప్రజలందరూ భద్రతా చర్యలు అనుసరించాలి. సోషల్ డిస్టెన్స్ లో భాగంగా అందరూ 2 మీటర్ల దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి. కరోనా సమయంలో కూడా మన రైతులు కష్టపడి సాగు చేస్తున్నారు. వేదాల్లోనూ రైతులను ప్రశంసించే శ్లోకాలు ఉన్నాయి. అన్నదాతను గౌరవించే సంస్కృతి మనది. ప్రతి పండుగను పర్యావరణహితంగా చేసుకోవాలి. పిల్లలు ఆడుకునే బొమ్మలు స్థానికంగానే తయారు చేయాలి. బొమ్మల తయారీ కోసం యువత ముందుకు రావాలి. స్థానిక కళలు, కళాకారులను మరింత ప్రోత్సహించాలి. మన కళానైపుణ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలి. కర్ణాటకలోని రామనగర జిల్లా చెన్నపట్టణం బొమ్మలు, ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లి బొమ్మలు, తమిళనాడులోని తంజావూరు బొమ్మలు, అస్సాంలోని డుబ్రి బొమ్మలు, ఉత్తర ప్రదేశ్‌లోని వారణాశి బొమ్మలు ప్రపంచదేశాలను ఆకట్టుకుంటున్నాయి. పిల్లల్లో దాగున్న సృజనాత్మకను వెలికితీయడానికి బొమ్మలు ఎంతగానో ఉపయోగపడతాయి. దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమల్లో స్టార్టప్‌లను ప్రారంభించడానికి అనేక చర్యలను తీసుకుంటున్నాం. ’అని ప్రధాని మోడీ అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాఖపట్నం జిల్లాలోని ప్రఖ్యాత ఏటికొప్పాక బొమ్మలు మరియు కృష్ణాజిల్లా కొండపల్లి బొమ్మల గురించి మోడీ ప్రస్తావించారు. అలాగే ఏటికొప్పాక కళాకారుడు సీవీ రాజు గొప్పదనం గురించి కూడా ఆయన గుర్తుచేశారు.

గణేష్ చతుర్థి జరపడంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంటుంది. కరోనా దృష్ట్యా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం రాష్ట్రంలో ఊరేగింపులను నిషేధించింది. అదే బాటలో పలు రాష్ల్రాలు కూడా ఊరేగింపులను నిషేధించాయి.

కరోనా వల్ల ఈ సంవత్సరం ఓనం పండుగ కూడా ఎటువంటి సందడి లేకుండా చేసుకోబడుతుంది. ‘కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించి అందరూ ఓనం పండుగను జరుపుకోవాలి. పండుగకు సంబంధించి బహిరంగ సభలు మరియు బహిరంగ వేడుకలు మానుకోవాలి’అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం ప్రజలను కోరారు.

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ లలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా.. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ఐదు రాష్ట్రాల్లోనే మరణాలు కూడా అత్యధికంగా నమోదయ్యాయి. ఏదేమైనా కూడా కంటెయిన్ మెంట్ జోన్ల వెలుపల లాక్డౌన్ విధించలేమని కేంద్రం రాష్ట్రాలకు తెలిపింది. అంతేకాకండా.. నాల్గవ దశ అన్‌లాకింగ్ కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను శనివారం ప్రకటించింది.

For More News..

అనుమతుల కోసం రామ్ మందిర్ లేఅవుట్