జపాన్ ప్రధానితో బుల్లెట్ రైలులో సెండాయ్ చేరుకున్న ప్రధాని మోడీ..!

జపాన్ ప్రధానితో బుల్లెట్ రైలులో సెండాయ్ చేరుకున్న ప్రధాని మోడీ..!

ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల జపాన్ పర్యటనలో ఉన్నారు. 15వ భారత్-జపాన్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు మోడీ జపాన్ వెళ్లారు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేయటంతో పాటు కొత్త వ్యాపార పెట్టుబడుల ఆకర్షణగా ఈ పర్యటన కొనసాగుతోంది. ఇదే క్రమంలో సెమీకండక్టర్స్, బుల్లెట్ రైలు వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు కూడా ఉన్నాయి. 

రెండవ రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ జపాన్ పీఎం షిగేరు ఇషిబాతో కలిసి బుల్లెట్ రైలులో ప్రయాణించారు. ఇరు దేశాల నేతలు రైలులో టోక్యో నుంచి సెండాయ్ చేరుకున్నారు. ఈ క్రమంలో తూర్పు జపాన్ రైల్వే కంపెనీలో శిక్షణ పొందుతున్న భారతీయ రైలు డ్రైవర్లతో సమావేశమయ్యారు మోడీ. భారతీయ లోకో పైలట్‌లను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. 

ALSO READ : రెండు నాల్కల ధోరణి అంటే ఇదే..

రెండు దేశాల మధ్య స్నేహం, పురోగతికి ఈ బుల్లెట్ రైలు ప్రయాణం సూచిస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు నాయకులు కొత్త ఆల్ఫా-ఎక్స్ రైలును కూడా పరిశీలించారు. దీనికి ముందు ప్రధానమంత్రి మోదీ 16 జపాన్ ప్రిఫెక్చర్ల గవర్నర్లతో సమావేశమై.. రాష్ట్ర-ప్రిఫెక్చర్ సహకారం సామర్థ్యాన్ని హైలైట్ చేశారు. 15వ వార్షిక ఇండియా-జపాన్ సమ్మిట్ సందర్భంగా ప్రారంభించబడిన రాష్ట్ర-ప్రిఫెక్చర్ భాగస్వామ్య చొరవ కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం మోడీ పర్యటన ద్వారా భారతదేశం-జపాన్ సంబంధాల్లో స్థిరమైన పురోగతిని సాధిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.