ఇస్రో సైంటిస్టులను డిఎంకే అవమానించింది: ప్రధాని మోదీ

ఇస్రో సైంటిస్టులను డిఎంకే అవమానించింది: ప్రధాని మోదీ

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకు పడ్డారు. స్టాలిన్, డిఎంకే పార్టీ ఇస్రో సెంటిస్టులను అవమానించిందని ఆయన ఆరోపించారు. తమిళనాడులోని ఇస్రో లాంచ్‌ప్యాడ్‌కు  చైనా సంబంధించిన స్టిక్కర్లను అతికించి డీఎంకే భారతీయ శాస్త్రవేత్తలను అవమానించిందని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. డిఎంకె అంతరిక్షంలో భారతదేశం పురోగతిని సహించటానికి సిద్ధంగా లేని పార్టీ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. అంతరిక్షంలో భారత్ పురోగతిని చూడడం వారికి ఇష్టం లేదని.. అందుకే అలా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బుధవారం  తమిళనాడులోని తిరునల్వేలిలో  జరిగిన ఓ కార్యక్రమంలో  ప్రధాని మోదీ ప్రసంగించారు.

డీఎంకే ప్రభుత్వం ఇస్రో ఘనతను చైనాకు కట్టబెట్టడం చాలా విచారకరమని, ఇది దేశ ప్రజలకు, తమిళనాడు ప్రజలకు ద్రోహం చేయడమేనని ప్రధాని మోదీ అన్నారు.  డీఎంకే ప్రభుత్వం ఇస్రో ఫొటోలో చైనా జెండాను పాతి దేశానికి నమ్మక ద్రోహం చేసిందన్నారు. ఈ చర్య మన శాస్త్రవేత్తలను అవమానించడమేనంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రధాని తన పర్యటన సందర్భంగా తూత్తుకుడిలో స్వదేశీ హైడ్రోజన్ ఇంధనంతో నడిచే జలమార్గ నౌకను జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇక్కడ రూ.17 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు.