2023లో G20 సదస్సును మరో లెవెల్‌కి తీసుకెళ్దాం:ప్రధాని మోడీ

2023లో G20 సదస్సును మరో లెవెల్‌కి తీసుకెళ్దాం:ప్రధాని మోడీ

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంపై ప్రధాని మోడీ కీలక సూచనలు చేశారు. దేశ ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కరోనా మరోసారి విజృంభిస్తోందని.. దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. మాస్క్లు ధరించి... చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నారు.  చాలా మంది ప్రజలు సెలవు  మూడ్‌లో ఉన్నారని....  పండుగలను ఆనందంగా జరుపుకోవాలన్నారు. అయితే కరోనా కారణంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్వీయ రక్షణే కరోనాకు మందు అని చెప్పారు.  జాగ్రత్తగా ఉంటేనే సురక్షితంగా ఉంటామన్నారు. భారత్ 220 కోట్ల కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి.. నమ్మలేని రికార్డును సృష్టించిందన్నారు. మన్ కీ బాత్లో భాగంగా  మాట్లాడిన ప్రధాని మోడీ....కొన్నేళ్లుగా ఆరోగ్య రంగంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. స్మాల్‌పాక్స్, పోలియో వంటి వ్యాధులను భారత్ తుడిచిపెట్టిందని తెలిపారు. ప్రస్తుతం కాలా అజర్ అనే వ్యాధి బీహార్‌, జార్ఖండ్ లోని 4 జిల్లాల్లో మాత్రమే ఉందన్నారు... దాన్ని కూడా అంతం చేస్తామన్నారు.

 
2022 స్పూర్తిదాయకం..

2022 ఏడాదిలో దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. భారత్ అమృత కాలం ప్రారంభమైందని చెప్పారు. అంతేకాదు భారత్ ప్రపంచంలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని ప్రకటించారు. 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను అధిగమించిందన్నారు. ఇండియా జీ20 సదస్సుకు అధ్యక్షత వహించే బాధ్యతను తీసుకుందన్న మోడీ.. 2023లో G20 సదస్సును మరో లెవెల్‌కి తీసుకెళ్దామన్నారు.  అటు నమామీ గంగా మిషన్ ద్వారా పర్యావరణం మెరుగైందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ భారతీయుల మెదళ్లలో దూసుకుపోయిందని చెప్పారు. 2022 సంవత్సరం చాలా స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. అనేక రంగాల్లో అద్భుతాలను సృష్టించగలిగామని తెలిపారు. 2022లో సాధించిన విజయాలు దేశాన్ని ప్రపంచంలోనే  గొప్ప స్థానంలో నిలిపాయన్నారు.

ఈ ఏడాది చివరి మన్ కీ బాత్..

ఆల్ ఇండియా రేడియోలో ఈ ఏడాది ప్రధాని మోడీ చివరి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. 2014లో అధికారంలోకి వచ్చాక మోడీ రేడియోలో  మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతీ నెల చివరి ఆదివారం మాట్లాడుతున్నారు. మన్ కీ బాత్ లో ఇది 94వ ఎడిషన్. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ  తన అభిప్రాయాలను దేశ ప్రజలతో పంచుకుంటున్నారు. నెలలో జరిగిన ముఖ్య ఘటనలను.. చివరి ఆదివారం రోజున మన్ కీ బాత్ లో ప్రధాని ప్రస్తావిస్తున్నారు. ప్రతీ నెలాఖరులోని చివరి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 మధ్య ఈ ప్రోగ్రామ్ జరుగుతోంది.