మోడీ చీరలు…రాహుల్ షర్టులు

మోడీ చీరలు…రాహుల్ షర్టులు

మోడీ అంటే ఇష్టమా.. రాహుల్​కు పెద్ద ఫ్యానా.. అయితే మీ అభిమానాన్ని వెరైటీగా చూపించే చాన్సుంది. మోడీ చీరలు.. రాహుల్​ చొక్కాలు వేసుకుని మీ ఫేవరెట్​ లీడర్ కు సపోర్ట్​ చేయవచ్చు. ప్రస్తుతం వీరి ఫొటోలతో కూడిన చీరలు, చొక్కాలు, కుర్తాలు, జాకెట్స్​ మార్కెట్​ను ముంచెత్తుతున్నాయి. ప్రియాంక, మమత, మాయావతి బొమ్మలతో చీరలూ మార్కెట్​లోకి వచ్చాయి. ఎన్ని ఉన్నా మోడీ చీరలు, టీషర్ట్స్​హాట్​ కేకులుగా మారాయి. గతంలోనూ ఈ ట్రెండ్​ ఉన్నా.. ఇప్పుడది​ పీక్‌కు చేరింది. 2014లో ప్రధాని మోడీ డిజిటల్​ ఫొటోలతో శారీ ప్రింటింగ్​ మొదలైంది. మోడీకి మద్దతుగా సూరత్​ శారీ మాన్యుఫ్యాక్చర్‌ ఈ శారీలను డిజైన్ చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా చొక్కాలు, టీషర్ట్స్ వరకూ పాకింది. అయితే ఈ ఎలక్షన్​ టైమ్​లోనే వీటికి క్రేజ్​ పెరిగింది. మోడీ శారీలు, డ్రెస్​లకు మంచి రెస్పాన్స్ రావడంతో మిగతా నాయకుల బొమ్మలతోనూ ప్రింటింగ్​ మొదలైంది. అయితే మోడీని బీట్​ చేయడం మాత్రం ఎవరి వల్లా కాలేదు. నిన్న మొన్నటి వరకూ ఆఫ్​ లైన్​ అమ్మకాలకే పరిమితమైన ఈ బిజినెస్​ ఇప్పుడు ఆన్​లైన్​ లోనూ జోరుగా సాగుతోంది. మోడల్స్​ వెరైటీ వెరైటీ డ్రెస్సులు, శారీలు, షర్ట్స్​ వేసుకుని జనాలను అట్రాక్ట్​ చేస్తున్నారు. తమకు ఇష్టమైన పొలిటికల్​ పార్టీని బట్టి జనం డ్రెస్​ను సెలెక్ట్​ చేసుకుంటున్నారు. ఆన్​లైన్​ పోర్టళ్లలో మోడీ డిజిటల్​ ఫొటోతో ఉన్న శారీల రేట్లు రూ.1,000 నుంచి రూ.3,500 వరకూ ఉన్నాయి. సూరత్​లో మొదలైన ఈ ట్రెండ్​ ఇప్పుడు ఇతర ప్రాంతాలకూ పాకింది. మోడీతో పాటు రాహుల్​, ప్రియాంక, మమత ఫొటోలతోనూ పార్టీ సింబల్స్​తోనూ చీరలు, చొక్కాల ప్రింటింగ్​ జరుగుతోంది.