దటీజ్ ఇస్రో స్పిరిట్.. ఆ రాత్రి దేశమంతా మేల్కొనే ఉంది : మోడీ

దటీజ్ ఇస్రో స్పిరిట్.. ఆ రాత్రి దేశమంతా మేల్కొనే ఉంది : మోడీ

సెప్టెంబర్ 7వ తేదీన అర్ధరాత్రి చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ .. చంద్రుడి ఉపరితలాన్ని తాకే వేళ దేశమంతా మేల్కొనే ఉందని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. హర్యానాలోని రోహ్తక్ లో భారీ బహిరంగ సభలో మాట్లాడిన మోడీ.. ఇస్రో ప్రయోగం దేశాన్ని ఒక్కటి చేసిందన్నారు.

“ఆరోజు దేశమంతా చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చూస్తూ.. టీవీల ముందే కూర్చుంది. ఆ వంద సెకన్లలో నేనో విషయం గమనించాను. ఓ సంఘటన దేశం మొత్తానికి ఎలాంటి మేల్కొలుపు సందేశం ఇస్తుందన్నదానికి నేను సాక్షిగా నిలిచాను. ఒక సంఘటన ఒక దేశం మొత్తాన్ని ఎలా ఒక్కటి చేస్తుందన్నదానిని స్వయంగా తెల్సుకున్నా. ఓ ఆటగాడి విషయంలో సాధారణంగా ఇలాంటి స్ఫూర్తి కనిపిస్తుంది. ఇపుడు హిందూస్థాన్ లో… ఇస్రో స్పిరిట్ కనిపిస్తోంది” అని అన్నారు ప్రధాని మోడీ.