ఇది న్యూ ఇండియా.. మళ్లీ దాడి చేస్తే మీ పని ఖతం : మోడీ

ఇది న్యూ ఇండియా.. మళ్లీ దాడి చేస్తే మీ పని ఖతం : మోడీ

ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో బహిరంగ సభలో పాల్గొన్నారు. దేశ భద్రతలో రాజీలేని పోరాటం చేస్తున్నామని చెప్పారు ప్రధానమంత్రి. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న అంశాలనే హైలైట్ చేస్తూ తన ప్రసంగాలను కొనసాగిస్తున్నారు.

“గతంలో ఎప్పుడూ ఏం జరిగేదంటే.. పాకిస్థాన్ నుంచి టెర్రరిస్టులు వస్తుండేవారు. మనపై దాడి చేస్తుండేవారు. మా దేశంపై దాడి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడుస్తూ ఉండేది. కానీ.. ఇపుడు పరిస్థితి మారింది. ఇది న్యూ ఇండియా.  ఉరీలో టెర్రరిస్టులు దాడి చేస్తే… వీర సైనికులు సర్జికల్ స్ట్రైక్ చేశారు. మళ్లీ అదే తప్పును టెర్రరిస్టులు పుల్వామాలో రిపీట్ చేశారు. అప్పుడు టెర్రరిస్టుల ఇండ్లలోకి వెళ్లి ఎయిర్ స్ట్రైక్ చేశారు. మళ్లీ అలాంటి తప్పు చేస్తే ఈసారి మరింత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని వారికి తెలిసొచ్చింది ” అని మోడీ అన్నారు.