పవన్కు మోదీ కేంద్రమంత్రి ఆఫర్

పవన్కు మోదీ కేంద్రమంత్రి ఆఫర్

కేంద్ర కేబినెట్ లో చేరాలని జనసేన చీఫ్, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ను ప్రధాని మోదీ కోరినట్టు తెలుస్తున్నది. ఆయనకు కేబినెట్ హోదా ఇచ్చి, ఏదో ఒక రాష్ర్టం నుంచి రాజ్యసభకు పంపించాలని ప్రధాని భావించారు. కానీ ఈ ఆఫర్ ను పవన్ కల్యాణ్ సున్నితంగా తిరస్కరించినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. పార్టీ ఏర్పాటైన పదేండ్ల తర్వాత పవన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. 

ఇప్పుడు వెంటనే కేంద్రంలో చేరితో జనసేన నేతలు, కార్యకర్తల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని, అందుకే రాష్ట్రంలో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ గ్రామ, మండల, జిల్లా, రాష్ర్ట కమిటీలు నియమించి.. రానున్న రోజుల్లో రాష్ర్ట వ్యాప్తంగా పర్యటిస్తూ, అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడానికే పవన్ కేంద్ర కేబినెట్ లో చేరలేదని సమాచారం. కాగా, 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లను జనసేన గెలుచుకుంది. పోటీ చేసిన అన్ని సీట్లలో విజయం సాధించింది. కూటమి అభ్యర్థుల గెలుపులోనూ జనసేన చీఫ్ పవన్ కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆయనకు రాష్ట్ర కేబినెట్ లో డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ లేదా మరేదైనా కీలక శాఖ ఇవ్వాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.