
తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ… చెన్నై-మధుర మధ్య లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించిన తేజస్ ట్రైన్ ను ప్రారంభించారు. తర్వాత తమిళనాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ… వింగ్ కమాండర్ అభినందన్ ధైర్య సాహసాలను ప్రశంసించారు. అతని ఆత్మవిశ్వాసం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమన్నారు ప్రధాని మోడీ.