పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన

పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన

సబర్కాంత: గుజరాత్ పర్యటనలో ఉన్న మోడీ అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సబర్కాంత జిల్లోలోని గదోడ చౌకిలో సబర్ డెయిరీకి సంబంధించి ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించిన మోడీ... మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు ఎంతో మేలు జరగనుందని తెలిపారు. వందలో కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ వల్ల పాల ఉత్పత్తులు మరింత పెరిగి... గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదం చేయనుందని చెప్పారు. అంతు కాకుండా చాలా మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు మోడీ తెలిపారు.

మొత్తం 10 వేల మందితో ఏర్పాటు చేసిన ఫార్మర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్... ఇప్పుడు 100 శాతం ఫలితాలను రాబడుతోందని స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో మోడ్రన్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా పనులు వేగంగా జరగడంతో పాటు అధిక ప్రయోజనాలు కలగునున్నట్లు మోడీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్ర భాయి పటేల్, రాష్ట్ర మంత్రులు జగదీశ్ భాయి విశ్వ కర్మ, గజేంద్ర సింగ్ పార్మార్, కుబేర్ భాయి దిండోర్, ఎంపీలు సీఆర్ పాటిల్, దీప్ సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.