మోడీ చేస్తున్న అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మోడీ చేస్తున్న అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: దళితుల కోసం ప్రధాని మోడి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నాడని.. వాటిని ప్రజల్లో కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. సోమాజిగూడలోని కత్రీయ హోటల్ లో దళితుల అభివృద్ధి.. బీజేపీ సంకల్పం పై సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఎస్సీ మోర్చ జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య, జాతీయ ప్రధాన కార్యదర్శి శంభు నాథ్ ప్రసాద్ తుండియా, బీజేపీ మధ్యప్రదేశ్ ఇంచార్జి మురళీధర్ రావు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఏ, చంద్రశేఖర్, బీజేపి నేతలు బంగారు శృతి, ఎస్ కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 
మూడెకరాల పొలం మాటెత్తకూడదనే 10 లక్షలిస్తా అంటుండు: వివేక్ వెంకటస్వామి
దళిత ద్రోహి కేసీఆర్ కొత్త కొత్త పథకాల పేరుతో దళితులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. దళితుడుని సీఎం చేస్తా అని మోసం చేసి డిప్యూటీ సీఎం చేశాడని.. ఆ తర్వాత బర్త్ రఫ్ చేసిండని గుర్తు చేశారు. కానీ ప్రధాని మోడీ కేంద్రంలో 12 మంది దళితులను కేంద్ర మంత్రులను చేసిండని తెలిపారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓట్ల కోసమే దళితులకు 10 లక్షలు ఇస్తామని మోసం చేసే ప్రయత్నాలూ చెస్తున్నాడని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. దళితులకు మూడు ఎకరాల భూమిని ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడు, మూడు ఎకరాలకు ప్రభుత్వ రేటు ప్రకారం ఎకరానికి 7 లక్షల చొప్పున వేసుకున్నా 21లక్షలు అవుతుందని, ఈ మూడు ఎకరాల భూమి మాటను మర్చిపోయెందుకే దళితులకు 10లక్షలు అని చెప్తున్నాడన్నారు. కేసీఆర్ మాటలను దళితులు నమ్మొద్దు అని ఆయన హెచ్చరించారు. 90% దళితులే కౌలు దారులుగా ఉన్నారని, దళిత కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వమంటే ఇస్తలేడని వివేక్ వెంకటస్వామి విమర్శించారు.