హైదరాబాద్, వెలుగు: మల్టీ మెడికల్ స్పెషాలిటీల కోసం ఆల్ ఇన్ వన్ క్లౌడ్ సొల్యూషన్‌లను అభివృద్ధి చేసే యూఎస్ బేస్డ్ కంపెనీ మోడ్‌మెడ్ హైదరాబాద్‌లో తన మొదటి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ)ని ప్రారంభించినట్లు ప్రకటించింది. హైటెక్ సిటీలో కొత్త సదుపాయంలో ఉన్న ఈ సెంటర్‌ను 20 వేల చదరపు అడుగుల్లో నిర్మించారు. మోడ్‌మెడ్ ఈ సంవత్సరం చివరి నాటికి దాని ప్రస్తుత 100 మంది ఉద్యోగుల సంఖ్యను 200లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవెలప్మెంట్ కోసం కొత్త వారిని నియమించుకోనుంది.
డాక్టర్లతో సహా ప్రపంచవ్యాప్తంగా 1,700 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు దీనికి ఉన్నారు. అలర్జీ, డెర్మటాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, ఓటోలారిన్జాలజీ, పెయిన్ మేనేజ్‌మెంట్, ప్లాస్టిక్ సర్జరీ, పాడియాట్రీ యూరాలజీ ప్రాక్టీస్‌ల కోసం మెడికల్ స్పెషాలిటీ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లను ఇది అందిస్తుంది.
