IPL 2025: నా పేరెంట్స్ ఉండే ప్రదేశానికి దగ్గర్లోనే బాంబు దాడులు జరిగాయి: కేకేఆర్ ఆల్ రౌండర్ ఆవేదన

IPL 2025: నా పేరెంట్స్ ఉండే ప్రదేశానికి దగ్గర్లోనే బాంబు దాడులు జరిగాయి: కేకేఆర్ ఆల్ రౌండర్ ఆవేదన

ఐపీఎల్ 2025 నుంచి ఇంగ్లాండ్ స్పిన్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ వైదొలిగాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న మొయిన్ అలీ  కారణం చెప్పకుండానే ఈ మెగా టోర్నీ నుంచి తప్పకున్నాడు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత ఐపీఎల్ 8 రోజుల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో తాను ఐపీఎల్ లోని మిగిలిన మ్యాచ్ లకు ఇండియాకి తిరిగి రావడం లేదని షాక్ ఇచ్చాడు. మొయిన్ అలీ ఇంగ్లాండ్ జట్టులో లేకపోయినా.. ప్రస్తుతం ప్రపంచ లీగ్ ల్లో ఈ ఆల్ రౌండర్ ఆడకపోయినా ఐపీఎల్ నుంచి ఎందుకు వైదొలిగాడో తెలియలేదు. 

ALSO READ | ఆసియా కప్ 2025 వైదొలిగిన భారత్.. ఏసీసీకి తేల్చి చెప్పిన బీసీసీఐ..!

కేకేఆర్ యాజమాన్యం కూడా మొయిన్ అలీ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా మొయిన్ అసలు విషయం బయట పెట్టాడు. తాను ఐపీఎల్ 2025 నుంచి ఎందుకు తప్పుకున్నాడో వివరణ ఇచ్చాడు. ఇండియా, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు కారణంగా టోర్నమెంట్ నుండి ముందుగానే నిష్క్రమించవలసి వచ్చిందని.. ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు తన తల్లిదండ్రులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఉన్నారని వెల్లడించాడు. 

మొయిన్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.. " ఆపరేషన్ సిందూర్ సమయంలో  భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తల పరిస్థితులు నెలకొన్నాయి. దాడులు జరిగేటప్పుడు నా పేరెంట్స్ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నారు.నా పేరెంట్స్ ఉండే ప్రదేశానికి దగ్గర్లోనే బాంబు దాడులు జరిగాయి. కొద్ది రోజుల్లోనే పరిస్థితులు తీవ్రంగా మారాయి. యుద్ధంలో చిక్కుకున్నామని వాళ్లకి అర్థమైంది. అదృష్టవశాత్తు వాళ్లున్న ప్రాంతంలో బాంబు దాడులు జరగలేదు. వెంటనే విమానం ఎక్కి పీఓకే నుంచి వాళ్లు సేఫ్‌గా రావడంతో నేను ఊపిరి పీల్చుకున్నా" అని బియర్డ్ బిఫోర్ వికెట్ పాడ్‌కాస్ట్‌లో మొయిన్ తెలిపాడు.