IPL 2026: ఐపీఎల్‌కు వచ్చేస్తున్నా.. పాక్ ఫాస్ట్ బౌలర్ అధికారిక ప్రకటన

IPL 2026: ఐపీఎల్‌కు వచ్చేస్తున్నా.. పాక్ ఫాస్ట్ బౌలర్ అధికారిక ప్రకటన

పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ మహమ్మద్ అమీర్ త్వరలోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడాలనే తన కోరికను వ్యక్తం చేస్తూ అమీర్ 2026లో జరిగే టోర్నమెంట్‌లో ఆడటానికి అర్హత సాధిస్తానని చెప్పాడు. ఈ లెఫ్టర్మ్ ఫాస్ట్ బౌలర్ బ్రిటిష్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా పాస్‌పోర్ట్ పొందలేదు. 2016లో బ్రిటీష్ యువతి నర్జీస్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న అమీర్.. 2020 నుంచి  ఇంగ్లండ్‌లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ఏడాది గడిస్తే అతనికి బ్రిటిష్ పౌరసత్వం లభించనుంది. తద్వారా ఐపీఎల్‌లో ఆడటానికి మార్గం సుగమం కానుంది.

అమీర్ పాస్‌పోర్ట్ కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదు. అమీర్ పాస్‌పోర్ట్ పొందితే ఐపీఎల్ లో అతను బ్రిటీష్ పౌరుడిగా ఐపీఎల్ ఆడడానికి అర్హత సాధిస్తాడు. లెఫ్ట్ హ్యాండర్ బౌలరైన అమీర్.. ఒకానొక సమయంలో పాక్ జట్టులో కీలక బౌలర్. అలాంటిది స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. 2010లో స్పాట్ ఫిక్సింగ్ కారణంగా అమీర్‌పై.. పీసీబీ ఐదేళ్లు నిషేధం విధించింది. అనంతరం పీసీబీ అధికారులపై న్యాయ పోరాటం చేసిన అమీర్.. 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు.

ALSO READ : Jasprit Bumrah: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు రిస్క్ అవసరమా.. ఐపీఎల్ ఫస్ట్ హాఫ్‌కు బుమ్రా ఔట్!

2024 టీ20 వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ తరపున ఆడేందుకు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అమీర్ మరోసారి అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇండియా- పాకిస్తాన్ దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో పాక్ ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడటం లేదు. ఈ క్రమంలో ఆమీర్ ఐపీఎల్‌లో ఆడటం కోసం పాక్ పౌరసత్వాన్నే వదులుకుంటున్నాడు. గతంలో ఈ పాక్ ఫాస్ట్ బౌలర్ తనకు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాలనే తన మనసులోని మాట బయటపెట్టాడు.