IND vs SA: టీమిండియాకు బిగ్ షాక్..టెస్టు సిరీస్ నుంచి షమీ ఔట్

IND vs SA: టీమిండియాకు బిగ్ షాక్..టెస్టు సిరీస్ నుంచి షమీ ఔట్

దక్షిణాఫ్రికా వేదికగా రేపటి (డిసెంబర్ 17) నుంచి టీమిండియా  మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత డిసెంబర్ 26 నుంచి రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా సఫారీల రూపంలో భారత్  తొలి పరీక్షను ఎదుర్కొనబోతుంది. అయితే ఈ టెస్టు సిరీస్ కు భారత స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో భారత్ ఈ స్టార్ పేసర్ లేకుండానే ఈ కఠిన సవాలుకు సిద్ధమవుతుంది. 

సబ్జెక్టు టు ఫిట్ నెస్ కింద టెస్టు సిరీస్ కింద ఎంపికైన షమీ..చీలమండ నొప్పి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. వరల్డ్ కప్ లో గాయపడిన ఈ స్టార్ బౌలర్ సఫారీల సిరీస్ కు కోలుకుంటాడని భావించినా అది జరగలేదు. షమీ స్థానంలో యువ పేసర్ నవదీప్ సైనీకు అవకాశం దక్కొచ్చు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో సహా చివరి బ్యాచ్ ఆటగాళ్లు డిసెంబర్ 15న జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్లనున్నారు. శుక్రవారం దక్షిణాఫ్రికాకు వెళ్లే ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, ఆర్ అశ్విన్, నవదీప్ సైనీ, హర్షిత్ రాణా పేర్లు ఉన్నాయి.  

2024 జనవరి 25 నుంచి ఇంగ్లాండ్ జట్టు 5 టెస్టుల కోసం భారత్ లో పర్యటించనుంది. ఈ సిరీస్ కు షమీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వరల్డ్ కప్ లో 24 వికెట్లు తీసి టాప్ ఫామ్ లో ఉన్న షమీ లేకపోవడం భారత జట్టుకు పెద్ద లోటే అనే చెప్పాలి. పైగా ఈ స్టార్ పేసర్ సఫారీ గడ్డపై అద్భుతమైన రికార్డ్ కలిగి ఉన్నాడు. షమీతో పాటు వన్డే జట్టు నుంచి దీపక్ చాహర్ తప్పుకున్నాడు. తన తండ్రి అనారోగ్యం కారణంగా చాహర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

భారత టెస్టు జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ద్ కృష్ణ.