సిరాజ్ పని బలే ఉందిలే.. ఖవ్వాలి ప్రోగ్రామ్‌లో ఎంజాయ్ చేస్తున్న స్టార్ పేసర్

సిరాజ్ పని బలే ఉందిలే.. ఖవ్వాలి ప్రోగ్రామ్‌లో ఎంజాయ్ చేస్తున్న స్టార్ పేసర్

భారత క్రికెటర్లు ఓ వైపు ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ కు సిద్ధమవుతుంటే స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. హైదరాబాద్‌లో ఖవ్వాలీ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో సిరాజ్ కు రెస్ట్ ఇవ్వడంతో ఈ గ్యాప్ లో రిలాక్స్ అవుతున్నాడు. ఖవ్వాలిలో సిరాజ్ ఎంజాయ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2023 వరల్డ్ కప్ ముగిసిన తరువాత హైదరాబాద్‌లో నిర్వహించిన ఖవ్వాలీ కార్యక్రమానికి సిరాజ్ హాజరయ్యాడు.

ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో సిరాజ్ అద్భుతంగా రాణించాడు. కేప్ టౌన్ లో జరిగిన రెండో టెస్టులో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. సిరాజ్ ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 9 ఓవర్లు వేసినసిరాజ్  3 మెయిడిన్స్ తో కేవలం 15 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. పేసీ పిచ్ లపై నిప్పులు చెరిగే బంతులేస్తూ సఫారీ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. అతన్ని ఎదుర్కోవటానికి.. వికెట్లు పడకుండా కాపాడుకోవటానికి సౌతాఫ్రికా బ్యాటర్లు నానా తంటాలు పడుతున్నారు.

ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ తో సిరీస్ కు దూరంగా ఉన్న సిరాజ్ ఈ నెల 25 నుంచి ఇంగ్లాండ్ తో జరగబోయే 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ కు అందుబాటులో ఉంటాడు. సిరీస్ లో భాగంగా తొలి టెస్టు హైదరాబాద్ లో జరగనుంది. విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాలలో వరుసగా 2,3,4,5 టెస్టులు ఆడాల్సి ఉంది. గత నెలలో ఇంగ్లాండ్ జట్టును ప్రకటించగా.. త్వరలో భారత జట్టుకు ఎంపిక చేస్తారు.