ఏసీబీకి చిక్కిన మహ్మదాబాద్ ఎస్సై సురేశ్

ఏసీబీకి చిక్కిన మహ్మదాబాద్ ఎస్సై సురేశ్

గండీడ్, వెలుగు: మహబూబ్​నగర్  జిల్లా మహ్మదాబాద్  ఎస్సై సురేశ్​ ఆదివారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్సీ కృష్ణగౌడ్  తెలిపిన వివరాల ప్రకారం.. గండీడ్  మండలం పగిడియాలకు శ్రీనివాస్ రెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి ప్రేమించుకున్నారు.  చివరికి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో, బాధితులు శ్రీనివాస్ రెడ్డిపై కేసు పెట్టారు.

అతడిని రిమాండ్ కు పంపించగా, బెయిల్​పై విడుదలయ్యాడు. రిమాండ్​కు ముందు రూ.50 వేలు ఇవ్వాలని ఎస్సై సురేశ్.. శ్రీనివాస్​రెడ్డిని డిమాండ్  చేశాడు. మధ్యవర్తుల ద్వారా రూ.30 వేలు ముందే తీసుకున్నాడు. మిగిలిన రూ.20 వేలు ఇవ్వాలని అడగడంతో బాధితుడు ఏసీబీ ఆశ్రయించాడు. ఆదివారం సాయంత్రం మిగిలిన రూ.20 వేలు ఇవ్వడానికి బాధితుడు పోలీస్ స్టేషన్​కు వెళ్లగా, రైటర్  ఇస్మాయిల్​కు ఇవ్వాలని ఎస్సై చెప్పాడు.

ఆయన తీసుకోకుండా పక్కనే ఉన్న జిరాక్స్  సెంటర్  ఓనర్​ మూసాకు ఇవ్వాలని చెప్పాడు. ఏసీబీ అధికారులు మూసా దగ్గర ఉన్న రూ.20 వేలు స్వాధీనం చేసుకొని ఎస్సై సురేశ్, రైటర్  ఇస్మాయిల్, జిరాక్స్  సెంటర్  ఓనర్​ మూసాపై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.