వన్డే నెంబర్ వన్ బౌలర్ ర్యాంకు కోల్పోయిన సిరాజ్

వన్డే నెంబర్ వన్ బౌలర్ ర్యాంకు కోల్పోయిన సిరాజ్

దుబాయ్‌‌‌‌‌‌‌‌: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ నుంచి మూడో ర్యాంక్‌‌‌‌‌‌‌‌కు పడిపోయాడు. బుధవారం తాజాగా రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసిన లిస్ట్‌‌‌‌‌‌‌‌లో సిరాజ్‌‌‌‌‌‌‌‌ 702 రేటింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లతో మిచెల్‌‌‌‌‌‌‌‌ స్టార్క్‌‌‌‌‌‌‌‌ (702)తో కలిసి సంయుక్తంగా థర్డ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో 3 వికెట్లు తీసిన హైదరాబాదీ పేసర్‌‌‌‌‌‌‌‌.. రెండో వన్డేలో మూడు ఓవర్లలోనే 37 రన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో భారీగా ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు కోల్పోయాడు.

జనవరిలో సిరాజ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. హాజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ (713), ట్రెంట్‌‌‌‌‌‌‌‌ బౌల్ట్‌‌‌‌‌‌‌‌ (708) వరుసగా టాప్‌‌‌‌‌‌‌‌‌‌-2 లో కొనసాగుతున్నారు. మహ్మద్‌‌‌‌‌‌‌‌ షమీ ఐదు ప్లేస్‌‌‌‌‌‌‌‌లు మెరుగుపడి 28వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ (733) ఐదో ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో ఉండగా, విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ (714), స్టీవ్‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌ (714)తో కలిసి సంయుక్తంగా ఏడో ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ (704) ఒక్క స్థానం పైకి ఎగబాకి 9వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ను దక్కించుకున్నాడు.