నవంబర్‌‌‌‌ లో మోహన్ లాల్ వృషభ

నవంబర్‌‌‌‌ లో మోహన్ లాల్ వృషభ

మలయాళ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘వృషభ’. సమర్జిత్ లంకేష్‌‌, రాగిణి ద్వివేది, నయన్ సారిక, నేహా సక్సేనా, రామచంద్రరాజు కీలకపాత్రలు పోషించారు.  ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి నంద కిషోర్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్‌‌తో క‌‌లిసి అభిషేక్ వ్యాస్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని   నిర్మిస్తోంది.  ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని నవంబర్ 6న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల చేయనున్నట్టు గురువారం ప్రకటించారు. 

మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు నంద కిషోర్ మాట్లాడుతూ ‘బ‌‌ల‌‌మైన భావోద్వేగాల‌‌తో పాటు అద్భుత‌‌మైన విజువ‌‌ల్స్‌‌తో ఈ సినిమాను రూపొందించాం. ఇందులోని బంధాలు, త్యాగాలు ఆడియెన్స్‌‌కు గొప్పగా క‌‌నెక్ట్ అవుతుంది’ అని చెప్పాడు.  

నిర్మాత ఏక్తా క‌‌పూర్ మాట్లాడుతూ ‘లార్జర్ దేన్ లైఫ్ డ్రామాతో ఇండియ‌‌న్ సినిమాను గొప్పగా ఆవిష్కరిస్తున్నాం.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల‌‌కు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను అందించ‌‌టానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు.