లూసిఫర్ 2 లోడింగ్

లూసిఫర్ 2 లోడింగ్

‘దృశ్యం 3’ షూట్ త్వరలోనే మొదలు పెడతామని ఇటీవలే కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మ్ చేసిన మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్.. ఇప్పుడు మరో మూవీ సీక్వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షూట్‌లోనూ జాయినవడానికి రెడీ అంటున్నారు. ఆ సినిమా మరేదో కాదు.. ‘లూసిఫర్ 2’. పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్ నటించిన ‘లూసిఫర్’ భారీ విజయం సాధించింది. దాంతో ‘ఎంపురాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సీక్వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీయబోతున్నామని అప్పట్లోనే చెప్పాడు పృథ్విరాజ్. అయితే మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఉన్న కమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ కారణంగా కాస్త టైమ్ పట్టింది. ఇప్పుడు కూడా ఆయన చేతిలో తొమ్మిది సినిమాలున్నాయి. అయితే వీటిలో చాలావరకు పోస్ట్ ప్రొడక్షన్ దశకు చేరుకోవడంతో ఇక ‘లూసిఫర్’ సెకెండ్ పార్ట్​ని పట్టాలెక్కిం చేందుకు నిర్ణయించుకున్నారు.

రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పృథ్విరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రైటర్ మురళి గోపి, నిర్మాత ఆంటోనీ పెరంబవూర్ కలిసి చర్చించుకున్నారు. ఆ ఫొటోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, వీడియోని ట్విటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్ చేయడంతో అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. మరో భారీ హిట్ లోడింగ్ అంటూ తమ కామెంట్లతో సోషల్ మీడియాని నింపే స్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని అద్భుతమైన ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దుతానని, మొదటి పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంటే సూపర్బ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చూపించబోతున్నానని పృథ్విరాజ్ చెప్పాడు. అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వీడియోకి ‘లూసిఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ క్లైమాక్స్ సీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని జోడించడం ద్వారా మొదటి పార్ట్ ఎక్కడ మొదలైందో రెండో భాగం అక్కడి నుంచే స్టార్టవుతుందని హింట్ కూడా ఇచ్చాడు.