OMG : వేలాడుతున్న కరెంట్ తీగలు తగిలి తల్లీ బిడ్డ కాలిపోయారు

OMG : వేలాడుతున్న కరెంట్ తీగలు తగిలి తల్లీ బిడ్డ కాలిపోయారు

తమిళనాడులో దీపావళి జరుపుకుని బెంగళూరుకు వచ్చిన 23 ఏళ్ల మహిళ.. ఆమె తొమ్మిది నెలల కుమార్తె నవంబర్ 19న తెల్లవారుజామున వైట్‌ఫీల్డ్ మెయిన్ రోడ్‌లోని పేవ్‌మెంట్‌పై వేలాడుతున్న లైవ్ వైర్‌ను ప్రమాదవశాత్తూ తొక్కడంతో అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. పవర్ యుటిలిటీ బెస్కామ్ కార్యాలయం నుంచి కేవలం 100 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో ఆమెకు కాస్త దూరంలో ఉన్న ఆమె భర్త.. భార్యను, కూతురిని కాపాడే ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నించి అతను కూడా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. మృతి చెందిన మహిళను సౌందర్య, కుమార్తె సువిక్ష లియాగా గుర్తించారు. ఇక భర్త సంతోష్ కుమార్ ఓ ఫర్నిచర్ షోరూంలో సేల్స్ మేన్ గా పని చేస్తున్నాడు.

ఈ ఘటనపై స్పందించిన పరిశ్రమల శాఖ మంత్రి కేజే జార్జ్... లైన్ మ్యాన్, అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనే ముగ్గురు బెస్కామ్ సిబ్బందిపై విచారణ జరిపి, సస్పెన్షన్ ప్రకటించారు. అనంతరం బాధితుల కుటుంబానికి ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. ఈ నిర్లక్ష్యానికి కారణమైన ఐదుగురు బెస్కామ్ అధికారులపైనా కేసు నమోదు చేసినట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఫోలీస్ శివకుమార్ గునారే తెలిపారు. అంతే కాదు వారిని అరెస్ట్ చేసి, ఇటీవలే బెయిల్ పై విడుదల కూడా చేశారు. వైరు తెగిపోయినా తమకు ఎలాంటి సమాచారం అందలేదని బెస్కామ్ అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 1.30గంటల సమయంలో ఈ వైరు తెగిపడందని స్థానికులు తెలిపారు.