మంకీపాక్స్పై డబ్ల్యూహెచ్ఓ కీలక నిర్ణయం

 మంకీపాక్స్పై డబ్ల్యూహెచ్ఓ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా తేరుకోలేదు.. తాజాగా మంకీపాక్స్ అలజడి సృష్టిస్తోంది. పశ్చిమ ఆఫ్రికాలో బయటపడి ఇతర దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న మంకీపాక్స్ ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.  ప్రపంచ వ్యాప్తంగా బయటపడుతున్న కేసుల సరళిని విశ్లేషించగా... జూన్ చివరి వారం నుంచి జులై మొదటి వారం వరకు వైరస్ విస్తరణ వేగం 77శాతం పెరిగినట్లు గుర్తించారు. గణనీయ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉందని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ మహమ్మారి ఇప్పటి వరకు 75 దేశాలకు విస్తరించిందని, 16 వేల మంది ఈ వ్యాధి బారిన పడ్డారని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రేయేసన్ తెలిపారు. 

మంకీపాక్స్ తో ఐదుగురు చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు ప్రకటించారు.  స్వలింగ సంపర్కుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందని తెలిపారు. మరోవైపు దేశంలో మంకీపాక్స్  కేసులు మూడుకి  చేరాయి. ఇవన్నీ కేరళలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి నిలకడగానే ఉందన్నారు ఆ రాష్ట్ర  వైద్యశాఖ మంత్రి  వీణా జార్జ్. వీరికి ట్రీట్మెంట్  కొనసాగిస్తున్నామని తెలిపారు.