పాకిస్తాన్లో వాన,వరద బీభత్సం..నెలరోజుల్లో 266 మంది మృతి

పాకిస్తాన్లో వాన,వరద బీభత్సం..నెలరోజుల్లో 266 మంది మృతి

కుండపోత వర్షాలతో పాకిస్తాన్‌ అతలాకుతలం అయింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో ఎనిమిది మంది మృతిచెందారు. దీనితో మరణాల సంఖ్య 266కి చేరుకుంది. పాకిస్తాన్‌లోని అత్యంత ప్రభావితమైన ప్రాంతం పంజాబ్ ప్రావిన్స్..ఈ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది.ఒక్క పంజాబ్ ప్రావిన్స్ లోనే 144 మందికి పైగా చనిపోయారు. 488 మంది గాయపడ్డారు.

గత వారం రోజులుగా అనేక ప్రాంతాలు పాకిస్తాన్ లోని అనేక పట్టణాలు తీవ్రమైన వరదలను ఎదుర్కొన్నారు. అనేకచోట్లు ఇళ్లు, వీధుల్లో నీటి మట్టం మూడు నుంచి ఐదు అడుగులకు పైగా నిలిచుంది. వరదలతో భారీ విధ్వంసం జరిగింది. 

శుక్రవారం ఒక్కరోజే కొత్తగా వర్షాలు, వరదలకు ఎనిమిది మంది చనిపోయారు. ఖైబర్-పఖ్తుంఖ్వాలో ముగ్గురు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. ఇస్లామాబాద్ ,పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్-బాల్టిస్తాన్‌లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతిచెందగా సింధ్‌లో మరొకరు మరణించారు.

►ALSO READ | 5 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం రెండు కాళ్ళు నరికించుకున్నాడు..

జూన్ చివరలో రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 94 మంది పురుషులు, 46 మంది మహిళలు, 126 మంది పిల్లలు సహా మొత్తం 266 మంది ప్రాణాలు కోల్పోయారు. అదనంగా వర్షాల వల్ల సంభవించిన వివిధ ఘటనల్లో దేశవ్యాప్తంగా 628 మంది గాయపడ్డారని ప్రముఖ వార్తాపత్రిక ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది.