విపక్షాల ఆందోళన.. రాజ్యసభ 9కి వాయిదా

విపక్షాల ఆందోళన.. రాజ్యసభ 9కి వాయిదా

విపక్షాల ఆందోళనలతో ఈ వారం కూడా రాజ్యసభ వాషౌట్ అయ్యింది. ఉదయం నుంచి సభలో విపక్షాల ఆందోళనలతో సభను సోమవారానికి వాయిదా వేశారు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్. ఉదయం సభ ప్రారంభం కాగానే.. వాయిదా తీర్మానాలపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. అయితే.. సభ్యుల నోటీసులను తిరస్కరించారు డిప్యూటీ చైర్మన్. వాయిదా తీర్మానాలపై ఎప్పుడు చర్చించాలనేది.. విపక్ష సభ్యులు, కేంద్రమంత్రులు సమావేశమై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సభ్యులు వినకపోవడంతో 12 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 12 గంటలకు సభ ప్రారంభమయ్యాక కూడా పరిస్థితి మారకపోవడంతో సోమవారానికి వాయిదా వేశారు.