త్రివర్ణ భారతం..

త్రివర్ణ భారతం..


స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని సుప్రసిద్ధ భవనాలు, స్మారక చిహ్నాలు, చరిత్ర కలిగిన రైల్వే స్టేషన్లు త్రివర్ణ శోభతో కళకళలాడుతున్నాయి. 

‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఢిల్లీలోని పార్లమెంట్ భవనం, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ లు మువ్వన్నెల కాంతులీనుతున్నాయి. జాతీయ జెండా రంగుల్లో పార్లమెంట్ భవనం ప్రకాశిస్తోంది. అటు సఫ్దర్‌జంగ్ సమాధి, కుతుబ్ మినార్ త్రివర్ణాలతో వెలుగొందుతున్నాయి. 

 

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  హైదరాబాద్‌లోని చారిత్రాత్మక చార్మినార్ మూడు రంగులను అద్దుకుంది.  కాషాయం, తెలుపు, ఆకుపచ్చ విద్యుత్ దీపాల అలంకరణలో చార్మినార్ ధగధగ మెరిసిపోతుంది.  జాతీయ జెండా రంగుల్లోని చార్మినార్ దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి. ఆకట్టుకుంటున్నాయి.

 ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయంపై ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా  త్రివర్ణ లైటింగ్ ఏర్పాటు చేసింది. దీంతో కోణార్క్ సూర్యదేవాలయం మూడు రంగుల జెండాతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. 

మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే టెర్మినల్ భవనం జాతీయ జెండా రంగులతో మెరిసిపోతుంది. అటు ఉత్తరప్రదేశ్‌ లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్  త్రివర్ణ పతాకంతో వెలిగిపోతోంది.