సర్వేలో మోడీ నంబర్ 1.. మిగతా నేతల స్థానమేక్కడ?

సర్వేలో మోడీ నంబర్ 1.. మిగతా నేతల స్థానమేక్కడ?

ఇప్పుడు ఎన్నికలు పెడితే ఎవరు ప్రధానిగా కావాలన్న దానిపై జరిగిన సర్వేలో మోడీ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఆయన దరిదాపులో కూడా ఎవరూ పోటీ ఇవ్వలేకపోయారు. మోడీకి 53 శాతం మద్దతు దొరకగా.. రాహుల్ గాంధీకి కేవలం 13 శాతం ఓట్లు వచ్చాయి. ఇక మిగిలిన నేతలంతా సింగిల్ డిజిట్ ఓట్‌ పర్సెంటేజ్‌కే పరిమితమయ్యారు.

నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టికల్ – 370 రద్దు, జమ్ము కశ్మీర్ విభజన, పౌరసత్వ సరవణ చట్టం వంటి నిర్ణయాలపై దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో దేశాన్ని నడిపించగల బెస్ట్ నాయకుడు ఎవరన్నదానిపై ఇండియా టుడే – కార్వీ కలిసి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో సర్వే చేశాయి. ఇందులో తిరుగులేని చాయిస్‌గా ప్రధాని నరేంద్ర మోడీ మరో నేత ఎవరికీ అందనంతగా ప్రజాదరణ పొందారు. ఈ సర్వేలో మోడీకి 53 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆయన కంటే 40 శాతం దూరంగా ఉన్నారు. కేవలం 13 శాతం జనమే రాహుల్ వైపు మొగ్గు చూపారు. రాహుల్ తర్వాత ఆయన తల్లి, కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ 7% ప్రజల మన్ననలు పొందారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదుపరి ప్రధానిగా ఉండాలని కేవలం నాలగు శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ప్రధానిగా చూడాలని కేవలం 3 శాతం జనం కోరుకుంటున్నారు.

See Also

22 ఏళ్ల కుర్రాడి ప్రేమలో 60 ఏళ్ల బామ్మ

వేడినీళ్లతో ఎంతో మంచిది

న్యూడ్ ఫోటోలు తమ దగ్గర ఉన్నాయని బాలికను బెదిరించి..

సర్వే ఎలా జరిగింది

మళ్లీ ఎన్నికలు జరిగితే భారత ప్రధానిగా ఎవరు కావాలన్న దానిపై దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చేపట్టారు. 97 పార్లమెంటు నియోజకవర్గాలు, 194 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగారు. మొత్తం 12,141 మంది నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. వీరిలో స్త్రీ, పురుషులు దాదాపుగా చెరి సగం ఉన్నారు. అయితే 67 శాతం గ్రామాలు, 33 శాతం పట్టణాల్లో ఈ సర్వే చేశారు.

తర్వాతి ప్రధానిగా ఏ నాయకుడికి ఎంత శాతం మద్దతు..

నరేంద్ర మోడీ               53

రాహుల్ గాంధీ             13

సోనియా గాంధీ              7

అమిత్ షా                    4

ప్రియాంక గాంధీ          3

అరవింద్ కేజ్రీవాల్     2

మమతా బెనర్జీ            2

పి.చిదంబరం             2

రాజ్‌నాథ్ సింగ్           2

ఉద్ధవ్ థాక్రే                 1

నితిన్ గడ్కరీ               1

శరద్ పవార్                1

మాయావతి                1

అఖిలేశ్ యాదవ్        1

యోగి ఆదిత్యనాథ్      1

మతాలు, ప్రాంతాల వారీగా చూసినా మోడీనే ప్రధానిగా కావాలని అన్ని వైపుల నుంచి మద్దతు వచ్చింది.

                              నరేంద్ర మోడీ               రాహుల్ గాంధీ

హిందువులు                  60%                               10%

ముస్లింలు                        17%                               32%

ఇతరులు                         29%                               13%

ఉత్తర భారతం                52%                               11%

తూర్పు                            59%                              13%

పశ్చిమ                             66%                                6%

దక్షిణ భారతం                 36%                              22%