మోర్భీ ఘటన : ఓవెరా గ్రూప్ ఎండీకి అరెస్టు వారెంట్ జారీ

 మోర్భీ ఘటన : ఓవెరా గ్రూప్ ఎండీకి అరెస్టు వారెంట్ జారీ

అక్టోబర్ 30న గుజరాత్ మోర్బీ లో బ్రిడ్జి కూలి 134 మంది చనిపోయిన 3 నెలల తర్వాత అక్కడి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆ వంతెన రెనోవేషన్ పనులను చేపట్టిన ఒరేవా గ్రూపుకు చెందిన జయసుఖ్ పటేల్ కు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 70 కింద అరెస్టు వారెంటు జారీ చేసింది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ వంతెన నిర్వహణ బాధ్యతలు చేపట్టిన పటేల్ పారిపోకుండా పోలీసులు ఇంతకుమునుపే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ నెల 16న జయసుఖ్ పటేల్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ కోర్టు దాన్ని తిరస్కరించింది. ఈ ఘటనపై మరోసారి విచారించిన కోర్టు.. విచారణకు ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది.

మర్బీలోని మచ్చు నదిపై దాదాపు 100 ఏళ్ల క్రితం నాటి తీగల వంతెనను నిర్మించారు. అయితే ఈ బ్రిడ్జి కొంతభాగం దెబ్బతినడంతో ఒరెవా అనే గ్రూపుకు మరమ్మతు బాధ్యతలు అప్పగించారు. వంతెన పునరుద్ధరణ తర్వాత అక్టోబర్ 26 పునఃప్రారంభించారు. అయితే ఈ వంతెనను తెరిచిన 4 రోజులకే అక్టోబర్ 30న కుప్పకూలింది. ఈ ఘటనలో 134మంది చనిపోవడంతో ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.