డయల్ 100కి 95 వేల బ్లాంక్ కాల్స్

డయల్ 100కి 95 వేల బ్లాంక్ కాల్స్

హైదరాబాద్,వెలుగు: లాక్ డౌన్ టైంలో డయల్ 100కి రాంగ్ కాల్స్ వస్తున్నాయి. ఎమర్జన్సీ కాల్స్ తో బిజీగా ఉండే సిబ్బందికి ఇది తలనొప్పిగా మారింది. తెలియక పిల్లలు, కావాలనే ఆవారాలు ఫోన్లు చేస్తూ సతాయిస్తున్నారు. గత నెల 21 నుంచి ఈ నెల 12 వరకు డయల్ 100కి మొత్తం 94,968 బ్లాంక్ కాల్స్ వచ్చాయి. ఇందులో చిన్నపిల్లలు 100 నంబర్ ప్రెస్ చేయడం వల్ల వచ్చినవి కూడా చాలానే ఉన్నాయి. అలాగే న్యూసెన్స్ కాల్స్ సంఖ్యా తక్కువేం కాదు. ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 21,62,612 కాల్స్ రాగా లాక్ డౌన్ సంబంధిత కాల్స్ కేవలం 26,297 మాత్రమే. మరో 2,980 కాల్స్ ద్వారా కరోనా అనుమానితుల సమాచారం అందింది. దీంతో పాటు 94,101 అత్యవసర కాల్స్ ను సంబంధిత పోలీసులకు డయల్ 100 సిబ్బంది ట్రాన్స్ ఫర్ చేసింది.

For More News..

పండ్ల బుట్టకు ఫుల్ డిమాండ్.. ఒక్కరోజే 2500 ఆర్డర్లు

లారీలు తిరగొచ్చు.. నిబంధనలు ఇవే..

లాక్‌డౌన్‌ కు ‘దయ్యాల’ గస్తీ