ఈ వారం మరో 4 ఐపీఓలు

ఈ వారం మరో 4 ఐపీఓలు

 న్యూఢిల్లీ: ఈ వారం  నాలుగు కంపెనీల ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. రూ.237 కోట్లు సేకరించాలని చూస్తున్నాయి. ఈ నాలుగింటిలో ఒకటి మెయిన్ బోర్డ్ ఐపీఓ కాగా, మిగిలినవి ఎస్‌‌‌‌ఎంఈ ఐపీఓలు. 

1.  మెయిన్‌‌ బోర్డ్‌‌కి వస్తున్న  విభోర్ స్టీల్ ట్యూబ్స్‌‌‌‌ ఐపీఓ  ఈ నెల 13 న ఓపెనై 15 న ముగుస్తుంది. ఈ కంపెనీ రూ.72 కోట్లను సేకరించాలని ప్లాన్  చేస్తోంది. ఒక్కో షేరుని రూ.141–151 ప్రైస్ రేంజ్‌‌‌‌లో అమ్ముతున్నారు. 
2. కార్‌‌‌‌‌‌‌‌  రెంటల్ సర్వీస్‌‌‌‌లు అందించే వైజ్‌‌‌‌ ట్రావెల్ ఇండియా  ఈ నెల  12 న  ఐపీఓకి వస్తోంది. కంపెనీ షేర్లు  ఈ నెల 14 వరకు సబ్‌‌‌‌స్క్రిప్షన్ కోసం ఓపెన్‌‌‌‌లో ఉంటాయి. షేరు ధర రూ. 140 – 147. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 94.68 కోట్లు సేకరించాలని వైజ్‌‌‌‌ ట్రావెల్‌‌‌‌ ఇండియా చూస్తోంది. 
3. థాయ్‌‌‌‌ కాస్టింగ్‌‌‌‌  ఐపీఓ  ఈ నెల 15 న ఓపెన్‌‌‌‌ కానుంది. 19 న  ముగియనుంది. షేరు ధర రూ.73–77.  
4. కల్హరిధాన్‌‌‌‌ ట్రెండ్జ్‌‌‌‌ షేరు ఐపీఓలో రూ.45 దగ్గర అందుబాటులో ఉంటుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 15 న ఓపెనై 19 న ముగుస్తుంది. రూ. 22.49 కోట్లను పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించనుంది. 
5. మరోవైపు ఇప్పటికే ఓపెన్‌‌‌‌లో ఉన్న ఆల్పెక్స్ సోలార్‌‌‌‌‌‌‌‌, రుద్రా గ్యాస్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌ ఐపీఓలు ఈ నెల 12 న, పాలిసిల్ ఇరిగేషన్, ఎంటెరో హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌ 13 న ముగియనున్నాయి.