హైదరాబాద్, వెలుగు: రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలుగు రాష్ట్రాల్లో మరింతగా విస్తరించేందుకు ప్లాన్స్ వేసుకుంది. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉన్న 180 అవుట్‌లెట్లను 200 కు పెంచుతామని ప్రకటించింది. సుమారు 12 కొత్త అవుట్ లెట్లను తెలంగాణలో ఏర్పాటు చేస్తామని వివరించింది. క్లాసిక్ 350 మోడల్ కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ మీడియాతో మాట్లాడింది. ఫ్రాంచైజీ మోడల్‌లో ఈ అవుట్‌లెట్లను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌తో పాటు, ఖమ్మం, వరంగల్ వంటి సిటీల నుంచి కూడా కంపెనీ బైక్‌లకు మంచి డిమాండ్ ఉందని రాయల్ ఎన్‌ఫీల్డ్ పేర్కొంది.
