ఎంఎఫ్​లపై మిలీనియల్స్ ఆసక్తి

ఎంఎఫ్​లపై మిలీనియల్స్ ఆసక్తి
  • సిఎస్, లంప్సమ్ ఇన్వెస్ట్ మెంట్లపై ఇంట్రెస్ట్
  • ఇన్వెస్టర్లలో అత్యధుకులు నగరాల వాళ్లే

న్యూఢిల్లీ:మార్కెట్ల నుంచి మెరుగైన రాబడిని పొందాలనే ఆలోచనతో మిలీనియల్స్ ( 1981–1996 మధ్య పుట్టినవాళ్లు) మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్​లు)పై ఆసక్తి పెంచుకుంటున్నారు.  కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌‌‌‌మెంట్ సర్వీసెస్ (సీఎంఎంఎస్​) తాజా రిపోర్టు ప్రకారం గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2019– 2023) 76 లక్షల మంది కొత్త మిలీనియల్ ఇన్వెస్టర్లు ఎంఎఫ్​ పరిశ్రమలోకి వచ్చారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కొత్త మిలీనియల్ ఇన్వెస్టర్లలో 23శాతం మంది ఇప్పటికే తమ పెట్టుబడులను పూర్తిగా రీడీమ్ చేసుకున్నారు. ఈ ఐదు సంవత్సరాల్లో కొత్త మిలీనియల్స్ ఏయూఎం (నిర్వహణలో ఉన్న ఆస్తులు) విలువ రూ.96,425 కోట్లు ఉంది.

ఏయూఎం పరంగా దేశంలోని టాప్ –15 ఎంఎఫ్​లలో పది ఇందులో ఉన్నాయి. కొత్త మిలీనియల్ ఇన్వెస్టర్లలో మూడింట రెండు వంతుల మంది సిప్​ లకు ప్రాధాన్యం ఇచ్చేవారు. దాదాపు మూడింట ఒక వంతు మంది తమ పెట్టుబడులను లంప్సమ్​ ఇన్వెస్ట్​మెంట్లతో ప్రారంభించారు. సిప్​ లకు కూడా వీళ్లు ఇంపార్టెన్స్​ ఇస్తున్నారు. సీఎంఎంఎస్​–సర్వీస్డ్ ఫండ్‌‌‌‌ల కోసం మొత్తం కొత్త సిప్​ రిజిస్ట్రేషన్‌‌‌‌లలో 33శాతం మిలీనియల్స్‌‌‌‌ కేటగిరీ నుంచి ఉన్నాయి. ఐదు సంవత్సరాల క్రితం ఇది 19శాతం మాత్రమే. గత ఐదు సంవత్సరాల్లో మిలీనియల్స్ నుంచి వచ్చిన గ్రాస్​ ఇన్‌‌‌‌ఫ్లో రూ.1.03 లక్షల కోట్లు ఉంది. వీటిలో 62శాతం ఈక్విటీ  హైబ్రిడ్ ఫండ్‌‌‌‌లలోకి, మిగిలినవి డెట్ స్కీమ్‌‌‌‌లు, లిక్విడ్ స్కీమ్‌‌‌‌లలోకి వచ్చాయి. 95శాతం మంది మిలీనియల్స్ వారి ఎంఎఫ్​ఇన్వెస్ట్​మెంట్ల కోసం సలహాదారులను లేదా డిస్ట్రిబ్యూటర్లను ఎంచుకున్నారు.

కొత్త మిలీనియల్స్‌‌‌‌లో దాదాపు 35శాతం మంది ఆర్​ఐఏలు (రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ అడ్వైజర్స్) ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చారు. వీరిలో దాదాపు 86శాతం, టీ30 (టాప్​30) నగరాల నుంచి ఉన్నారు. మిగిలిన 14శాతం మంది బీ30 నగరాల నుంచి వచ్చారు. గత ఐదు సంవత్సరాల కాలంలో 1.76 మిలియన్ మిలీనియల్ ఇన్వెస్టర్లలో 68శాతం మంది లాభాలను కళ్లజూడగా,32శాతం మంది నష్టాలతో బయటికి వచ్చారు. లాభాలు వచ్చిన వారు పరిశ్రమలోకి తిరిగి వస్తున్నారు. 15.4 మిలియన్ల కొత్త మిలీనియల్ సిప్​ రిజిస్ట్రేషన్‌‌‌‌లలో 2019– 2023 మధ్య దాదాపు 37శాతం ( 5.7 మిలియన్లు) సిప్​లు రద్దయ్యాయి.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో తగ్గిన ఇన్‌‌‌‌ఫ్లో

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఇన్‌‌‌‌ఫ్లో ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో (మార్చితో పోలిస్తే) 68 శాతం తగ్గి రూ. 6,480 కోట్లకు చేరుకుంది. ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణితో ఉండటమే ఇందుకు కారణమని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. అయితే, ఈక్విటీ క్లాస్‌‌‌‌లో వరుసగా 26వ నెలలో ఇన్‌‌‌‌ఫ్లో ఎక్కువగా స్మాల్ క్యాప్,  మిడ్ క్యాప్ కేటగిరీల ద్వారా వచ్చింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) డేటా ప్రకారం.. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఏప్రిల్‌‌‌‌లో రూ. 1.21 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది. డెట్​ఆధారిత పథకాల నుండి భారీ పెట్టుబడులు వచ్చాయి.

గత నెలలో రూ. 19,263 కోట్ల అవుట్‌‌‌‌ఫ్లో ఉంది.  అంతకుముందు నెలలో రూ. 56,884 కోట్ల అవుట్‌‌‌‌ఫ్లో ఉంది. డెట్ ఫండ్స్​కు రూ. 1.06 లక్షల కోట్లు అందాయి. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఏయూఎంల విలువ రూ.39.42 లక్షల కోట్ల నుంచి ఏప్రిల్ చివరి నాటికి రూ.41.62 లక్షల కోట్లకు పెరిగింది. ఏప్రిల్‌‌‌‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రూ. 6,480 కోట్లను ఆకర్షించాయి. అంతకుముందు నెలలో రూ. 20,534 కోట్ల ఇన్‌‌‌‌ఫ్లో ఉంది. వాల్యుయేషన్స్ పెరగడం వల్ల ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులకు దూరంగా ఉంటున్నారని, మార్కెట్‌‌‌‌ ర్యాలీని ఉపయోగించుకునేందుకు కొంత డబ్బు పక్కనబెడుతున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ స్ట్రాటజిస్ట్ శ్రీరామ్ అన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 50 ఏప్రిల్‌‌‌‌లో 4 శాతం పెరిగింది. ఈక్విటీలలో, స్మాల్–క్యాప్ కేటగిరీ, మిడ్‌‌‌‌క్యాప్ కేటగిరీలు వరుసగా రూ.2,182 కోట్లు రూ.1,791 కోట్ల  ఇన్​ఫ్లోలను రాబట్టాయి.