కరోనా నిర్మూలనకు మరింత పోరాటం చేయాలి: తమిళిసై

కరోనా నిర్మూలనకు మరింత పోరాటం చేయాలి: తమిళిసై

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని… ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌. నిన్న(ఆదివారం) ఒక్కరోజే రాష్ట్రంలో 199 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం, ఇద్దరు మెడికల్ విద్యార్థులు, పోలీసులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగించే విషయమన్నారు. కరోనాను అరికట్టేందుకు మరింత పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటూ గవర్నర్‌ ట్విట్టర్  ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.

కరోనా విషయంలో ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుతో మన భద్రతను పక్కన పెట్టకూడదన్నారు. వైరస్‌ బారిన పడకుండా ఇప్పటి వరకు పాటించిన జాగ్రత్తలే ఇకముందు కూడా పాటించాలని సూచించారు. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు వైరస్‌కు వర్తించదన్నారు. కరోనా బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసై విజ్ఞప్తి చేశారు.