నాంపల్లిలో అధికం.. కంటోన్మెంట్​లో తక్కువ

నాంపల్లిలో అధికం.. కంటోన్మెంట్​లో తక్కువ
  • హైదరాబాద్​ జిల్లాలో బరిలో మొత్తం 312 మంది అభ్యర్థులు  
  • నామినేషన్ ​విత్​డ్రా చేసుకున్న 20 మంది క్యాండిడేట్లు 

హైదరాబాద్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్​ హైదరాబాద్ ​పరిధిలోని 15 సెగ్మెంట్లలో  మొత్తం 312 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 332 నామినేషన్లు రాగా, బుధవారం విత్​డ్రాకు చివరి తేదీ కావడంతో 20 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ​ నాంపల్లి సెగ్మెంట్ నుంచి అధికంగా 34 మంది, ​కంటోన్మెంట్​నుంచి తక్కువగా10 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

సెగ్మెంట్​             పోటీలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య

అంబర్‌‌‌‌పేట         20    
 గోషామహల్‌‌‌‌         21
 జూబ్లీహిల్స్‌‌‌‌         19
 ఖైరతాబాద్‌‌‌‌          25
 ముషీరాబాద్‌‌‌‌        31
 సనత్‌‌‌‌నగర్‌‌‌‌          16
 సికింద్రాబాద్‌‌‌‌       24 
 కంటోన్మెంట్‌‌‌‌       10 
 మలక్‌‌‌‌ పేట          27 
  నాంపల్లి              34
 బహదూర్‌‌‌‌పురా     12
 చాంద్రాయణగుట్ట     14 
 చార్మినార్‌‌‌‌             14 
 కార్వాన్‌‌‌‌                 18 
 యాకుత్‌‌‌‌పురా       27