ప్రపంచ వ్యాప్తంగా 67 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 67 లక్షలు దాటిన కరోనా కేసులు

మహమ్మారి కరోనా పంజా విసురుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 67,02,699 కు చేరాయి. 3,93,212 మంది చనిపోయారు. 32,51,592 మంది కోలుకున్నారు.30,57,895 మంది చికిత్స తీసుకుంటున్నారు. అత్యధిక కరోనా కేసులతో అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతోంది. అక్కడ 19,24,051 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,10,173 మంది చనిపోయారు. కొద్ది రోజులుగా అమెరికాలో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

బ్రెజిల్ లో 6,15,870 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 34,039  మంది చనిపోయారు. రష్యాలో 4,41,108కేసులు నమోదవ్వగా 5384 మంది చనిపోయారు. మిగతా దేశాలతో పోలిస్తే రష్యాలో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. స్పెయిన్ లో కరోనా కేసులు 2లక్షల 87వేలు దాటాయి. 27వేల మంది చనిపోయారు. యూకేలో 2లక్షల 81వేల కేసులు రికార్డయ్యాయి. 39,900 మంది చనిపోయారు. ఇటలీలో కరోనా కేసులు 2లక్షల 34వేలు దాటాయి. 33వేల మంది మృతి చెందారు.ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు 2లక్షల26 వేలు దాటగా 6348 మంది చనిపోయారు.

see more news

కదులుతున్న ట్రైన్ లో పసికందు..పరుగెత్తి పాల ప్యాకెట్ ఇచ్చిన కానిస్టేబుల్

24 గంటల్లో 9851 కరోనా కేసులు..273 మంది మృతి

చాహల్ పై యువరాజ్ సింగ్ కామెంట్స్..పోలీస్‌‌ కేసు నమోదు