దద్దరిల్లిన గాజా.. 24 గంటల్లో 704 మంది మృతి

 దద్దరిల్లిన గాజా.. 24 గంటల్లో 704 మంది మృతి
  • బాంబు దాడులతో దద్దరిల్లిన గాజా
  • రెండ్రోజుల్లో 720 టార్గెట్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్
  • గాజాలో 5 వేలకు పెరిగిన మృతుల సంఖ్య
  • బందీల జాడ చెప్పాలంటూ ఇజ్రాయెల్ కరపత్రాలు
  • మరో ఇద్దరు బందీలను రిలీజ్ చేసిన హమాస్

ఇజ్రాయెల్ చేస్తున్న బాంబు దాడులతో గాజా దద్దరిల్లుతున్నది. దీంతో 24 గంటల వ్యవధిలోనే 704 మంది పాలస్తీనియన్లు చనిపోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. క్షతగాత్రుల సంఖ్య 15,270కి పెరిగిందని తెలిపింది. హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా ఐడీఎఫ్ ఫైటర్ జెట్లు బాంబు దాడులతో విరుచుకుపడ్డాయి. సోమవారం 320 బిల్డింగులను, మంగళవారం మరో 400 టార్గెట్లను నాశనం చేశామని ఐడీఎఫ్ ప్రకటించింది. మరోవైపు హమాస్ మిలిటెంట్లు సోమవారం మరో ఇద్దరిని విడిచిపెట్టారు. దీంతో వారి చెర నుంచి విడుదలైన బందీల సంఖ్య నాలుగుకు చేరింది.

గాజా/జెరూసలెం: ఇజ్రాయెల్ బాంబు దాడులతో గాజా స్ట్రిప్ దద్దరిల్లుతోంది. హమాస్ మిలిటెంట్లపై వరుసగా 18వ రోజూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఫైటర్ జెట్ లు బాంబుదాడులతో విరుచుకుపడ్డాయి. హమాస్ మిలిటెంట్లు దాక్కుని ఉన్న 320 బిల్డింగ్ లను సోమవారం ధ్వంసం చేశామని.. మంగళవారం మరో 400 టార్గెట్లను నాశనం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లోనే 704 మంది పాలస్తీనియన్లు మృతిచెందారని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. క్షతగాత్రుల సంఖ్య 15,270కి పెరిగిందని తెలిపింది. 

గాజాలో ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థకు చెందిన సిబ్బంది మరో ఆరుగురు చనిపోగా, వీరి మరణాల సంఖ్య 35కు పెరిగింది.  ఉత్తరాదిన ఉన్న వెస్ట్ బ్యాంక్ లోని హమాస్ టార్గెట్లపైనా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇక్కడ ఇప్పటివరకూ 96 మంది చనిపోగా, 1,650 మంది గాయపడ్డారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్ల నరమేధానికి 1,400 మంది బలయ్యారు. మిలిటెంట్లు 220కిపైగా బందీలుగా తీసుకెళ్లగా.. సోమవారం మరో ఇద్దరిని విడిచిపెట్టారు. దీంతో హమాస్ చెర నుంచి విడుదలైన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఇజ్రాయెల్ దాడులతో గాజా స్ట్రిప్ లో దాదాపు14 లక్షల మంది ఇండ్ల నుంచి పారిపోగా.. వారిలో 5.80 లక్షల మంది యూఎన్​ ఆధ్వర్యంలోని స్కూళ్లు, షెల్టర్లలో తలదాచుకుంటున్నారు. 18 రోజులుగా ఇజ్రాయెల్ దిగ్బంధంలో మగ్గుతున్న గాజాలో తిండికి, నీళ్లకు, మందులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కరెంట్, ఫ్యూయెల్ లేకపోవడంతో అక్కడి జనం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే, హమాస్​ను అంతం చేసేదాకా పోరాటం ఆగదని ఇజ్రాయెల్ మరోసారి స్పష్టం చేసింది.  

శాంతిని కోరుకుంటే వారి జాడ చెప్పాలె..

పాలస్తీనియన్లు శాంతిని కోరుకుంటే గాజాలోని హమాస్ మిలిటెంట్లు, వారు బందీలను దాచి ఉంచిన ప్రదేశాల సమాచారం చెప్పాలంటూ ఇజ్రాయెల్ మంగళవారం మరోసారి కరపత్రాలను జారవిడిచింది. సమాచారం ఇచ్చిన వారికి రక్షణ కల్పించడంతో పాటు రివార్డ్ ఇస్తామని ప్రకటించింది. 

హమాస్ పైనా కలిసి పోరాడాలె: మాక్రన్    

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రన్ మంగళవారం ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ కు చేరుకున్నారు. హమాస్ పై పోరాటంలో ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటించారు. మిలిటెంట్ల దాడుల్లో మరణించిన వారిలో 30 మంది ఫ్రెంచ్ పౌరులు కూడా ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం జెరూసలెం చేరుకున్న ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. సిరియా, ఇరాక్ దేశాల్లోని ఇస్లామిక్ స్టేట్​పై పోరాడుతున్న అంతర్జాతీయ కూటమి హమాస్​పై పోరాటానికీ ముందుకు రావాలని మాక్రన్ పిలుపునిచ్చారు.  

జిహాద్ నినాదాలపై సునాక్ సీరియస్ 

తమ దేశంలో నిరసనల పేరుతో జిహాద్ నినాదాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హెచ్చరించారు. ‘‘ఈ వారాంతంలో మన వీధుల్లో విద్వేషాన్ని చూశాం. జిహాద్ కు పిలుపునివ్వడం అంటే యూదులకు మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య విలువలకే ప్రమాదం. మన దేశంలో అలాంటి వాటిని ఎన్నటికీ సహించం. టెర్రరిజానికి పాల్పడినోళ్లపై పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారు” అని ఆయన అన్నారు. 

మాట మార్చిన డ్రాగన్ 

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ త్వరలో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ యుద్ధంపై చైనా మాట మార్చింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలీ కోహెన్ కు వాంగ్ యీ ఫోన్ చేశారని.. ఇజ్రాయెల్ కు ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు ఉందని చెప్పారని చైనా అధికారిక మీడియా జిన్హువా ఓ కథనంలో పేర్కొంది.

గాజా/జెరూసలెం: ఇజ్రాయెల్ బాంబు దాడులతో గాజా స్ట్రిప్ దద్దరిల్లుతోంది. హమాస్ మిలిటెంట్లపై వరుసగా 18వ రోజూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఫైటర్ జెట్ లు బాంబుదాడులతో విరుచుకుపడ్డాయి. హమాస్ మిలిటెంట్లు దాక్కుని ఉన్న 320 బిల్డింగ్ లను సోమవారం ధ్వంసం చేశామని.. మంగళవారం మరో 400 టార్గెట్లను నాశనం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లోనే 704 మంది పాలస్తీనియన్లు మృతిచెందారని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. క్షతగాత్రుల సంఖ్య 15,270కి పెరిగిందని తెలిపింది. గాజాలో ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థకు చెందిన సిబ్బంది మరో ఆరుగురు చనిపోగా, వీరి మరణాల సంఖ్య 35కు పెరిగింది.  

ఉత్తరాదిన ఉన్న వెస్ట్ బ్యాంక్ లోని హమాస్ టార్గెట్లపైనా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇక్కడ ఇప్పటివరకూ 96 మంది చనిపోగా, 1,650 మంది గాయపడ్డారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్ల నరమేధానికి 1,400 మంది బలయ్యారు. మిలిటెంట్లు 220కిపైగా బందీలుగా తీసుకెళ్లగా.. సోమవారం మరో ఇద్దరిని విడిచిపెట్టారు. దీంతో హమాస్ చెర నుంచి విడుదలైన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఇజ్రాయెల్ దాడులతో గాజా స్ట్రిప్ లో దాదాపు14 లక్షల మంది ఇండ్ల నుంచి పారిపోగా.. వారిలో 5.80 లక్షల మంది యూఎన్​ ఆధ్వర్యంలోని స్కూళ్లు, షెల్టర్లలో తలదాచుకుంటున్నారు. 18 రోజులుగా ఇజ్రాయెల్ దిగ్బంధంలో మగ్గుతున్న గాజాలో తిండికి, నీళ్లకు, మందులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కరెంట్, ఫ్యూయెల్ లేకపోవడంతో అక్కడి జనం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే, హమాస్​ను అంతం చేసేదాకా పోరాటం ఆగదని ఇజ్రాయెల్ మరోసారి స్పష్టం చేసింది.  

శాంతిని కోరుకుంటే వారి జాడ చెప్పాలె..

పాలస్తీనియన్లు శాంతిని కోరుకుంటే గాజాలోని హమాస్ మిలిటెంట్లు, వారు బందీలను దాచి ఉంచిన ప్రదేశాల సమాచారం చెప్పాలంటూ ఇజ్రాయెల్ మంగళవారం మరోసారి కరపత్రాలను జారవిడిచింది. సమాచారం ఇచ్చిన వారికి రక్షణ కల్పించడంతో పాటు రివార్డ్ ఇస్తామని ప్రకటించింది. 

హమాస్ పైనా కలిసి పోరాడాలె: మాక్రన్    

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రన్ మంగళవారం ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ కు చేరుకున్నారు. హమాస్ పై పోరాటంలో ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటించారు. మిలిటెంట్ల దాడుల్లో మరణించిన వారిలో 30 మంది ఫ్రెంచ్ పౌరులు కూడా ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం జెరూసలెం చేరుకున్న ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. సిరియా, ఇరాక్ దేశాల్లోని ఇస్లామిక్ స్టేట్​పై పోరాడుతున్న అంతర్జాతీయ కూటమి 
హమాస్​పై పోరాటానికీ ముందుకు రావాలని మాక్రన్ పిలుపునిచ్చారు.  

జిహాద్ నినాదాలపై సునాక్ సీరియస్ 

తమ దేశంలో నిరసనల పేరుతో జిహాద్ నినాదాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హెచ్చరించారు. ‘‘ఈ వారాంతంలో మన వీధుల్లో విద్వేషాన్ని చూశాం. జిహాద్ కు పిలుపునివ్వడం అంటే యూదులకు మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య విలువలకే ప్రమాదం. మన దేశంలో అలాంటి వాటిని ఎన్నటికీ సహించం. టెర్రరిజానికి పాల్పడినోళ్లపై పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారు” అని ఆయన అన్నారు. 

ఒక్కర్ని బంధించి తెస్తే 10 వేల డాలర్లు..

ఇజ్రాయెల్​లో  నరమేధానికి పాల్పడుతూ పట్టుబడిన హమాస్ మిలిటెంట్లు విచారణలో ఒళ్లు గగుర్పొడిచే విషయాలను బయటపెడుతున్నారని ఇజ్రాయెల్ సెక్యూరిటీస్ అథారిటీ(ఐఎస్ఏ) అధికారులు వెల్లడించారు. మిలిటెంట్లు తమ నేరాలను ఒప్పుకుంటున్న వీడియోను మంగళవారం విడుదల చేశారు. మహిళలను, పిల్లలను, వృద్ధులనే టార్గెట్ చేయాలని, వీలైనంత ఎక్కువ మందిని బందీలుగా తీసుకురావాలని మిలిటెంట్లు చెప్పినట్లుగా అందులో ఉంది. అలాగే బందీలను పట్టుకొచ్చిన వారికి ఒక్కో బందీకి 10 వేల డాలర్లు (రూ. 8 లక్షలు), ఒక అపార్ట్​మెంట్  రివార్డ్ గా ఇస్తామని చెప్పారన్నారు. ఓ ఇంట్లోకి చొరబడినప్పుడు తాను ఓ మహిళను కాల్చానని, ఆమె కింద పడినా మళ్లీ కాల్చడంతో బుల్లెట్లు వేస్ట్ చేయొద్దంటూ తమ లీడర్ ఆగ్రహం వ్యక్తం చేశాడని ఓ మిలిటెంట్ చెప్పినట్లు కూడా ఆ వీడియోలో రికార్డ్ అయింది.