
కరోనావైరస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాలో మిలయన్‌కు పైగా పిల్లలు కరోనా బారినపడినట్లు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తెలిపింది. వీరంతా 18 ఏళ్లలోపు వయసు వారే. కరోనావైరస్ ప్రారంభం నుంచి నవంబర్ 12, 2020 వరకు చూసుకుంటే ఇప్పటివరకు 10,39,464 మంది పిల్లలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తెలిపింది. కాగా.. నవంబర్ రెండో వారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఆ వారంలో 1,11,946 కేసులు నమోదయ్యాయని తెలిపింది.
అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రెసిడెంట్ సాల్లీ గోజా మాట్లాడుతూ.. ‘తట్టు మరియు పోలియో వ్యాధులు వ్యాక్సిన్ రాకముందు కమ్యూనిటీల ద్వారా ఇంతాలా వ్యాప్తి చెందలేదు. కానీ, కరోనా మాత్రం విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాప్తిని తగ్గించడానికి వెంటనే కొత్త వ్యూహాన్ని అమలుచేయాలని అమెరికా ప్రభుత్వానికి సంస్థ తరపున సూచించాం. దాదాపు 14 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. కరోనా సంబంధిత వ్యాధులను కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది’ అని గోజా అన్నారు.