షో రూముల్లో రిజిస్ట్రేషన్ కు మరింత సమయం

షో రూముల్లో రిజిస్ట్రేషన్ కు మరింత సమయం
  • ఏప్రిల్ 1నుంచే అమలు చేయాలని కోరిన కేంద్రం

ఏప్రిల్ ఒకటి నుంచి షో రూముల్లోనే రిజిస్ట్రేషన్ చేయాలని కేంద్రం సూచించినప్పటికీ అది అమలు జరగడానికి ఆలస్యం అయ్యేలా ఉంది.ఇప్పటి వరకు దీనికి సంబంధించిన విధివిధానాలే ఖరారు కాలేదు. దాదాపు నాలుగు నెల క్రితం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యా ప్తంగా అన్ని రాష్ట్రాల్లోవాహనాలకు సంబంధించిన పర్మినెంట్ నంబర్ ప్లేట్ ను షో రూమ్ ల్లోనే చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం జాయింట్ ట్రాన్స్ పోర్ట్ లు, డిప్యూ టీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లతో కూడిన ఓ కమిటీని నియమించింది. కేంద్రం సూచించిన విధంగా షో రూమ్ ల్లోనే పర్మినెం ట్ నంబర్ ప్లేట్ లు బిగించేం దుకు సాధ్యా సాధ్యా లను పరిశీలిం చాలని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు ఈ కమిటీ విధివిధానాలను రూపొందిం చలేదు. ఇటీవలే ట్రాన్స్ పోర్ట్ అధికారులతో కూడిన బృందాలు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకుసిద్ధమవుతున్నారో అధ్యయనం చేసేందుకు వెళ్లారు . వీరిచ్చే నివేదికను పరిశీలిం చి ప్రభుత్వం నియమిం చిన కమిటీ విధివిధానాలు రూపొందించనుంది. ఐతే ఇదంతా ఏప్రిల్ 1 నాటికి పూర్తి కావాల్సి ఉంది. మరో 12 రోజులు మాత్రమే గడువు ఉండటంతో కమిటీ నివేదిక ఎప్పుడూ ఇస్తుందీ దానిపై చర్చిం చి ప్రభుత్వం ఎప్పుడూ నిర్ణయం తీసుకుంటుం దన్నది తెలియడం లేదు.దీంతో ఏప్రిల్ ఒకటి నాటికి మాత్రం ఇది అమల వటం సాధ్యం కాదని అధికారులే చెబుతున్నారు.

తొలి విడతలో టూ వీలర్స్ మాత్రమే….

షో రూమ్ నుంచే రిజిస్ట్రేష న్ అక్కడే నంబర్ ప్లేట్ బిగింపు విధానంలో భాగంగా తొలి విడతలో టూ వీలర్స్ వరకే అనుమతిం చాలని భావిస్తు న్నారు.మిగతా వాహనాలకు విడతల వారీగా అమలు చేయనున్నారు. ఐతే వీటిలో పలు కండిషన్లు ఉన్నాయి. ప్రభుత్వ వాహనాలకు సంబంధించి మినహాయింపు ఉంది. ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకున్న వారు కూడా ప్రస్తు  అమల్లో ఉన్న ఆన్ లైన్ వేలం పాట ద్వారానే వీటిని పొందవచ్చు. ఈ నిబంధన అమల్లోకి వస్తే తాత్కాలి క రిజిస్ట్రేష న్ కోసం ఒకసారి మళ్లీ పర్మినెంట్ రిజిస్ట్రేష న్ కోసం ఒకసారి ఆర్టీఏ కార్యా లయాల చుట్టు తిరగాల్సిన పనిలేదు. వాహనం కొన్న సందర్భంలో పర్మినెం ట్ రిజిస్ట్రేష న్ నంబర్ ను ఇచ్చే విధంగా చర్యలు తీసుకుం టున్నారు. ఐతే భారీ వాహనాలకు సంబంధించి మాత్రం కచ్చితంగా ఆర్టీఏ కార్యా లయాల్లోనే రిజిస్ట్రేష న్ చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

షో రూము ల్లో నే రిజిస్ట్రేషన్ పై అభ్యం తరాలు….

షో రూమ్ ల్లోనే వాహనాల రిజిస్ట్రేష న్ విధానంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చాలా షో రూమ్ లలో వాహనా దారుల నుంచి తాత్కాలిక రిజిస్ట్రేష న్ కోసమే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పర్మినెంట్ రిజిస్ట్రేష న్ కు సంబంధించి షో రూమ్ ద్వారానే జరిగితే అవినీతి మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆటో, ఫోర్ వీలర్స్ అసోసియేషన్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ కొత్త విధానాన్ని ఆన్ లైన్ రిజిస్ట్రేష న్ స్థానంలోకి కొత్త సాప్ట్ వేర్ తెచ్చేందుకు దాదాపు 11 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు అన్ని షో రూమ్ ల్లో రిజిస్ట్రేష న్, నంబర్ ప్లేట్ల ప్రక్రియ ప్రారంభించాలంటే ఖర్చు తో కూడిన వ్యవహారమని…షో రూమ్ నిర్వాహకులతో ట్రాన్స్ పోర్ట్ అధికారుల మధ్య సమన్వయం సాధ్యం కాదని చెబుతున్నారు.ఐతే అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే పైలట్ ప్రాజెక్ట్ గా ఒక్క షో రూమ్ లోనైనా ఈ రిజిస్ట్రేష న్, నంబర్ ప్లేట్ల బిగింపు విధానాన్ని పరిశీస్తామని చెబుతున్నారు.