పర్వత ప్రాంతంలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్

పర్వత ప్రాంతంలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్

ఎత్తైన పర్వత ప్రాంతంలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్​ ‘షిరకవగొ’. వింటర్​లో కురిసే మంచుకి ట్రయాంగిల్ షేప్​లో ఉన్న ఇగ్లూల్లా ఉంటాయి ఇక్కడి ఇళ్లు. రాత్రిళ్లు వెలిగే లైట్స్​ చీకటిలో తిరిగే మిణుగురు పురుగుల అందాలను గుర్తు చేస్తాయి. సంవత్సరమంతా ఇలాగే అద్భుతంగా ఉండే ఈ ప్లేస్​ చూడాలంటే జపాన్​లోని ఒనొ ప్రాంతానికి వెళ్లాల్సిందే. షిరకవగొ అనే ట్రెడిషనల్​ పేరు చాలా పాతకాలం నాటిది. ఇక్కడే మరో పెద్ద హిస్టారికల్ ప్లేస్​ కూడా ఉంది. దాని పేరు హిడా. ఆ రెండింటినీ కలిపి ‘హిడా షిరకవగొ’ అని పిలుస్తున్నారు ఇప్పుడు. పర్వతాల మధ్యలో ఉన్న ఈ ఊళ్లో 96 శాతం ఫారెస్ట్ ఏరియా. అందులో కొంత ఏరియా ఎవుసానికి వాడుతున్నారు. డిసెంబర్​ నుంచి మార్చినెల వరకు మంచు కురుస్తూ ఉంటుంది. రెండు నుంచి మూడు మీటర్ల వరకు మంచు పేరుకుపోతుంది. ఇప్పటివరకు రికార్డ్ 4.5 మీటర్లు. దీన్ని ఐసోలేటెడ్ ఐలాండ్, తెలియనివి ఎన్నో దాచుకున్న ప్రాంతమని కూడా అంటారు. మల్బరీ చెట్లు, పట్టుపురుగుల పెంపకం ఆదాయమార్గాలు. షిరకవగొలో దొరికే ఫ్రెష్​ ఇంగ్రెడియెంట్స్​​తోనే వాళ్లు వంటలు చేసుకుంటారు. 
 

ఏండ్లనాటి చరిత్ర
తవ్వకాల్లో దొరికిన కుండలు, పాత్రలతోపాటు, క్రీ. శకం 600, 700 ఏండ్ల నాటి అద్దం కూడా  దొరికింది. దాన్ని బట్టి ఈ ప్రాంతంలో ప్రజలు ఎప్పటి నుంచి  ఉంటున్నారో తెలుస్తోంది. అందుకే దీన్ని పురాతన గ్రామం అంటారు. అంతేకాదు, ఈ ఊరి పేరు మొదటిసారి1176లో చరిత్రలో కనిపించింది. క్యోటోలో ఒకాయన రాసుకున్న డైరీలో ఈ పేరు చాలా సార్లు ఉందట. ఆ తర్వాత నుంచి జపాన్​లో ఈ పేరు బాగా వినిపించింది. ఈ ఊరి వాళ్లు సరుబొబొ అనే బొమ్మను అదృష్టానికి గుర్తుగా భావిస్తారు. చూడ్డానికి కోతిపిల్లలా ఉంటుంది ఆ బొమ్మ. కానీ, దానికి ముఖం ఉండదు.
 

‘సాసు’ ఇండ్లు
ఇక్కడి ఇండ్లు గాస్సో – జుకురి స్టైల్​లో కట్టుకున్నారు. అంటే ఇంటి పైకప్పు గడ్డితో నిటారుగా తయారుచేస్తారు. అవి ట్రయాంగిల్ షేప్​లో ఉంటాయి. మంచు తుపాన్​లు వచ్చినప్పుడు తట్టుకునేందుకే ఇలా కట్టారు. ట్రయాంగిల్ షేప్​లో ఉండే ఈ ఇండ్లు, చూడ్డానికి రెండు చేతులతో దండం పెట్టినట్టు అనిపిస్తాయి. అందుకని ఈ స్టైల్​ని ‘సాసు’ స్ట్రక్చర్​ అంటారు. ఆ ఇండ్లలో చలికాలంలో వెచ్చగా, ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. మూడు వందల ఏండ్లుగా అవి అలాగే ఉన్నాయి. 1971లో నేచురల్ ఎన్విరాన్​మెంట్​ని కాపాడుకుంటూనే, షిరకవగొ విస్తరించాలనే ఉద్దేశంతో మూడు రూల్స్​ పాటించాలని ఎన్విరాన్​మెంట్ అసోషియేషన్ చెప్పింది. అవేంటంటే ‘ఈ ఇండ్లను అమ్మకూడదు. రెంట్​కి ఇవ్వకూడదు. పాడు చేయకూడదు’. ఈ రూల్స్​ని​ కొన్నేండ్ల వరకు పాటించింది కూడా. ఆ తర్వాత డిసెంబర్ 1995లో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్​గా గుర్తించారు.1997లో గాస్సో స్టైల్ ప్రిజర్వేషన్​ ట్రస్ట్ ఏర్పాటుచేశారు. టూరిస్ట్​లు చూడడం కోసం కొంతమంది రైతుల ఇండ్లు ఓపెన్​ చేసి ఉంటాయి. వాటిలో వాడా హౌస్​ పెద్దది. ఇవే కాకుండా కందా, నగసె హౌస్​లు కూడా ఉన్నాయి. 
 

మరో రెండు ఇలాంటివే
షిరకవగొకి ఉత్తరాన పది కిలో మీటర్ల దూరంలో గొకయామ ఉంది. గొకయామ అంటే ఐదు లోయలు అని అర్థం. ఆ విలేజ్​ చుట్టూ పర్వతాలతో ఉంటుంది. ఆ ఏరియాలో గన్​ పౌడర్​ మెటీరియల్ తయారుచేస్తారు. గాస్సో స్టైల్ ఇళ్లు ఉండే ఊళ్లు గొకయామలోనే రెండున్నాయి. 
వాటిలో ఒకటి ఐనొకుర. అందులో ఇలాంటి 23 ఇండ్లున్నాయి. వాటిలో అరవైమంది  ఉంటారు. రెండోది సుగనుమ. అందులో 9 ఇండ్లున్నాయి. ఇది చిన్న కమ్యూనిటీ. ఈ రెండు విలేజ్​ల మధ్య మురకమి హౌస్ ఉంది. అందులో ముఖ్యమైన కల్చరల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో పాతకాలంనాటి వెయ్యి రకాల టూల్స్, మెటీరియల్స్​ ఉంటాయి. ఈ ప్రాంతాల వాళ్లు గన్​ పౌడర్ కూడా తయారుచేస్తారు. గన్ పౌడర్ మెటీరియల్ ఎలా తయారుచేస్తారో తెలుసుకునేందుకు ఒక మ్యూజియం ఉంది. గొకయామలో జపనీస్ సోబా నూడిల్, టోఫు ఫుడ్స్​ ఫేమస్. 
 

డొబురొకు ఫెస్టివల్
డొబురొకు అనే రైస్​ బీర్​ తయారుచేస్తారు ఇక్కడ. దీన్ని డొబురొకు ఫెస్టివల్​లో తాగుతారు.1300 ఏండ్ల నుంచి వస్తోన్న ఆచారం ఇది. సెప్టెంబర్ చివరి తేదీ నుంచి ఆరు రోజులు ఈ పండుగ చేస్తారు. కోతకోసిన పంటను దేవుడికి అర్పించి, ప్రార్థనలు చేస్తారు. పండుగలో భాగంగా లయన్​ డాన్స్​లు చేస్తారు. పండుగ టైంలో అక్కడికి వెళ్లలేకపోతే.. వింటర్​లో వెళ్లొచ్చు. అప్పుడు పండుగకు సంబంధించిన వస్తువులు ఉంచిన మ్యూజియం తెరుస్తారు. ఇదే కాకుండా ఏప్రిల్14న టకయామ స్ర్పింగ్​ ఫెస్టివల్, జులై 16న గుజొ ఒడొరి, మే 27న హ్యాకుమన్గొకు మట్సూరి, అక్టోబర్ 9న టకయమా ఆటమ్​ ఫెస్టివల్స్ చేసుకుంటారు.
 

టూరిస్ట్ ఏరియా
టూరిస్ట్ ప్లేస్​లుగా రెండు ఏరియాలను విడదీశారు. ఇక్కడున్న ఇండ్లన్నీ 1800ల కాలంలో కట్టినవి. యునెస్కో ‘వరల్డ్​ హెరిటేజ్ ఏరియా’గా చేసింది.  సదరన్​ ఏరియాలో ఉండే దాన్ని ‘హిరేస్​ హాట్ స్ప్రింగ్ విలేజ్​’గా పిలుస్తారు. దాన్నే ‘సదరన్ నేచర్ ఏరియా’ అని కూడా అంటారు. అక్కడి నుంచి చూస్తే ఊరు అందంగా కనిపిస్తుంది. జపాన్​లోని మూడు ఫేమస్​ పర్వతాల్లో మౌంట్ హకు ఒకటి. దాన్నుంచి హిరేస్​ మీదకి నీళ్లు పడుతుంటాయి. అక్కడకి ఎక్కువగా ఆడవాళ్లే వెళ్తుంటారు. హెరిటేజ్ ఏరియా నుంచి సదరన్​ ఏరియాకు బస్ లేదా కార్​లో వెళ్తే15 నిమిషాలు పడుతుంది. ఈ ఊళ్లో హకుసన్ నేషనల్ పార్క్, అమొ ప్రిఫెక్చరల్ నేచర్​ పార్క్​లు ఉన్నాయి. 
 

ఏ సీజన్​లో వెళ్లాలి
ఇక్కడ నాలుగు సీజన్​లుంటాయి. మార్చ్​, మే నెలల్లో వెళ్తే చెర్రీ, రైస్ పంటల కాలం. జూన్​, ఆగస్ట్​లలో ఆకుపచ్చని చెట్లు, ఫాల్ సీస్​ ఫెస్టివల్స్​ ఉంటాయి. వింటర్​లో అయితే స్నో స్కేప్​లు చూడొచ్చు. టూరిజానికి పాపులర్​ సీజన్స్​ మే, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్​. ఈ నెలల్లో వెళ్తే ఫుల్​గా ఎంజాయ్​ చేయొచ్చు. డిసెంబర్​ నుంచి మార్చి వరకు స్నో ఫాల్ ఉంటుంది. ఇక్కడ ఉండేందుకు ఇండ్లు, వాటితోపాటు గెస్ట్ హౌస్​లు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే హౌస్​ ఓనర్స్ అందరకీ ఇంగ్లీష్​ అంత బాగా రాదు. టూరిస్టులకు బేసిక్ జపనీస్ లాంగ్వేజ్ వస్తే బెటర్. ​