ఈ కుక్క రేటు​ 20 కోట్లు

ఈ కుక్క రేటు​ 20 కోట్లు

అత్యంత ఖరీదైన కాకాసియన్ ​షెఫర్డ్ జాతి కుక్క ఇది. దీని ధర రూ.20 కోట్లు. శనివారం ఓ ఈవెంట్​లో పాల్గొనేందుకు దీన్ని  హైదరాబాద్​కు తీసుకొచ్చారు. బెంగళూరుకు చెందిన ఇండియన్​ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ సతీశ్​ దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. 

దీనికి కాడాబామ్​ హైడర్​ అనే పేరు పెట్టారు. ఈవెంట్​కు ముందు హెల్త్​ చెకప్ ​కోసం దీన్ని మియాపూర్​లోని పెట్​ క్లినిక్​కు తీసుకొచ్చారు. ముందస్తు సమాచారం ఉండడంతో డాగ్​ లవర్స్​ చాలా మంది క్లినిక్​కు చేరుకొని హైడర్​తో సెల్ఫీలు దిగారు. 

దీని వయసు మూడేండ్లని, రోజూ మూడు కేజీల చికెన్​ తీసుకుంటుందని సతీశ్​ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పలు షోల్లో పాల్గొన్నదని, సినిమాల్లోనూ నటించిందని చెప్పారు. 
- చందానగర్, వెలుగు